బాబు గారూ మరీ ఇంతలానా?: 19మంది డిన్నర్‌కి 18.29లక్షలు ఖర్చు!

ఏపీ ప్రభుత్వం పెడుతున్న ఖర్చులపై ఓ సామాజిక కార్యకర్త సేకరించిన సమాచారంలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి.ఏపీ ప్రభుత్వం 19మంది ప్రముఖుల భోజనాల కోసం ఏకంగా రూ.19లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతున్న ఖర్చులపై సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఓ సామాజిక కార్యకర్త సేకరించిన సమాచారంలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఏపీ ప్రభుత్వం 19మంది ప్రముఖుల భోజనాల కోసం ఏకంగా రూ.19లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది.

tdp govt spent Rs. 19lakhs for a dinner

ఆ వివరాల్లోకి వెళితే.. ఈ యేడాది ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఏపీ ప్రభుత్వం విజయవాడలో 'ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, కమర్షియల్ అండ్ ఎమర్జింగ్ లాస్' అనే అంశంపై రెండు రోజులపాటు అంతర్జాతీయ వర్క్ షాప్‌ను నిర్వహించారు. ఈ సమావేశానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

tdp govt spent Rs. 19lakhs for a dinner

వర్క్ షాప్ అనంతరం వీరి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందులో పాల్గొన్నది కేవలం 19మంది మాత్రమే. ఈ విందు కోసం ప్రభుత్వం రూ. 13,38,720 ఖర్చు చేసింది.

tdp govt spent Rs. 19lakhs for a dinner
tdp govt spent Rs. 19lakhs for a dinner

మరో రూ.4,90,705లను వారికి కల్పించిన సదుపాయాల కోసం ఖర్చు చేసింది. అంటే మొత్తం రూ.18,29,425లను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నమాట. కాగా, ప్రభుత్వం ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల విపక్ష పార్టీల నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టవచ్చు గానీ, ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+