బయటపడ్డ టీడీపీ సోషల్ మీడియా ప్రచారం
రాబోవు ఎన్నికలు టీడీపీకి చావో రేవో వంటివి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. దీనిలో భాగంగానే ఆ పార్టీ అధినేత చంద్రబాబు పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నారు. బీజేపీ, జనసేనలతో కలిసి అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించింది.
ఎన్నికల సమయంలో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే పనిలో టీడీపీ కూడా నిమగ్నమైనట్టు కనిపిస్తోంది. శాటిలైట్, డిజిటల్ మీడియాలో టీడీపీకి మద్దతుగా పలు ఛానెల్స్ పని చేస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వైసీపీతో పోలిస్తే సోషల్ మీడియాలో టీడీపీ ఇప్పటికి వెనుకపడే ఉంది. దీన్ని గమనించిన టీడీపీ అధిష్టానం పెద్ద ఎత్తున పార్టీకి ప్రచారం చేసేలా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంటుంది.

ఇప్పటికే iTDP టీం పార్టీ కోసం పని చేస్తోంది. దీంతో పాటు మరిన్ని టీంలను టీడీపీ అధిష్టానం రంగంలోకి దించింది. 1.5 లక్షల మందితో టీడీపీ ఓ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఈ గ్రూప్‌లో టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో పాటు, వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం వంటివి జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికలపై పట్టుపెంచుకునే విధంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. దీని కోసం భారీ ఎత్తున సోషల్ మీడియాలో గ్రూపులను క్రియేట్ చేసింది.

దాదాపు 1,48,313 ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 500 పేజీలు పనిచేస్తున్నాయి. "మన టీడీపీ" అప్లికేషన్‌లో దాదాపు 2.5 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ వ్యవస్థ మొత్తం పని చేస్తోంది. జగన్‌తో పాటు ఆయన పార్టీకి వ్యతిరేకంగా కంటెంట్ ప్రచారం చేస్తూ.. చంద్రబాబు,నారా లోకేష్ అనుకూల కంటెంట్‌గా ప్రజలకు చేరేలా చేయడంలో ఈ టీంలదే ప్రముఖ పాత్ర. వైసీపీకి వ్యతిరేకంగా పని చేయడంలో ఈ టీంలు కొంత వరకు సక్సెస్ అయినట్టే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించిన సోషల్ మీడియా..టీడీపీకి ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications