సంక్షోభంలో టీడీపీ.. సైమా వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్!!
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత నాలుగు రోజులుగా బెయిల్ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఎవరు అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ.
తెలుగుదేశం పార్టీలో ఎంతోకాలంగా ఉన్న సీనియర్లు నారా లోకేష్ మాట వినే పరిస్థితిలో లేరు. ఇదే సమయంలో బాలకృష్ణ రంగంలోకి దిగి నేనున్నానని చెప్పినప్పటికీ బాలయ్య ఎంతో కాలం పార్టీని ఏకతాటి మీద ముందుకు నడిపించే లేరు అన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతుంది. ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ మీద ఆసక్తికర చర్చ కూడా జరుగుతుంది.

తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చంద్రబాబు అరెస్టు పైన కానీ, తెలుగుదేశం పార్టీ విషయంలో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైపెచ్చు ఇవేవీ పట్టనట్టు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సైమా వేడుకల కోసం దుబాయ్ వెళ్లారు. ఇక ఈ సందర్భం టిడిపి నేతలకు తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తుంది.

సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో తాత పై అమితమైన ప్రేమను ప్రదర్శించే మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఈ కష్టకాలంలో నేనున్నానని ముందుకు రాకపోవడం టిడిపి శ్రేణులను నిరాశకు గురిచేస్తుంది. చంద్రబాబు అరెస్ట్ టిడిపికి మైలేజ్ ఇస్తుంది అనుకుంటే, ఊహించని విధంగా చంద్రబాబు బెయిల్ కూడా దొరక్క, బయటకు రాలేని పరిస్థితులు రావడంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

నేనున్నానని జూనియర్ ఎన్టీఆర్ భరోసా ఇస్తారు అనుకుంటే, అసలు రాజకీయాలకే తను దూరం అన్నట్టుగా సైమా అవార్డుల ఫంక్షన్ కు ఫ్యామిలీతో తారక్ దుబాయ్ వెళ్లడం ఇప్పుడు మరింత చర్చకు కారణంగా మారింది. టీడీపీ నేతలను మరింత కుంగదీస్తుంది.












Click it and Unblock the Notifications