ఏపీలో మహిళలపై దాడులు గత రెండేళ్లుగా పెరిగాయని జాతీయ మహిళా కమిషన్‌కు టీడీపీ నేత అనిత లేఖ

టీడీపీ నాయకురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులపై లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. గత రెండు ఏళ్ళలో ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సీతానగరం పుష్కర ఘాట్ దగ్గర మహిళ వేధింపులకు గురవడం దురదృష్టకరమని, సీతానగరం దగ్గర మహిళ గ్యాంగ్ రేప్ అంశాన్ని తన లేఖ ద్వారా జాతీయ మహిళా కమిషన్ కు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.

ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు నేరస్తులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై దాడుల ఘటనలు చోటు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది మాత్రం సున్నా అని మండిపడ్డారు. చట్టాలను సరిగా అమలు చేస్తే మహిళల రక్షణకు ఎలాంటి ఇబ్బంది వాటిల్లదని అనిత ఈ సందర్భంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం దిశా చట్టం తీసుకొచ్చినా ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదన్నారు. దిశ చట్టం ద్వారా దిశ పోలీస్ స్టేషన్ లు, దిశ మొబైల్ వెహికల్స్ , దిశ యాప్ ప్రచారం తప్ప సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని వంగలపూడి అనిత ప్రస్తావించారు.

TDP leader Anithas letter to the National Commission for Women over attacks on women in AP

సీతానగరం పుష్కరఘాట్ వద్ద యువతి అత్యాచారానికి గురవడం దురదృష్టకరమని పేర్కొన్న అనిత ఏపీ సీఎం జగన్ నివాసానికి, డిజిపి, స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగిందని లేఖలో పేర్కొన్నారు. మహిళలపై దాడుల విచారణకు ఒక బృందాన్ని రాష్ట్రానికి పంపవలసిందిగా వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. మహిళల రక్షణ కోసం జాతీయ మహిళా కమిషన్ దృష్టిసారించాలని ఈ సందర్భంగా తన లేఖ ద్వారా అనిత పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+