జగన్ రెడ్డి గారి భార్య భారతి ఆయన అబద్ధాలలో సగం : వైఎస్ భారతిని టార్గెట్ చేసిన టీడీపీ నేత అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పలు సంక్షేమ పథకాలను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, జగనన్న విద్యా కానుక ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా, రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉన్న సంక్షేమ పథకాల అమల్లో మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం సంక్షేమం పేరుతో జగన్ దోపిడీ చేస్తున్నాడని, రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డిని టార్గెట్ చేసిన అనిత
సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే కాకుండా, జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైయస్ భారతి రెడ్డి ని టార్గెట్ చేశారు. భారతి రెడ్డి ప్రజలతో పించను గురించి, అమ్మఒడి పథకం గురించి, వారికి చేకూరే లబ్ధి గురించి చెప్తున్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ అనిత మండిపడ్డారు.

అలా అసత్యాలు ప్రచారం చేయడం ప్రజలను వంచించడమే
జీవిత భాగస్వామి అంటే దాంపత్యజీవితంలో భార్య కూడా సగం .జగన్ రెడ్డి గారి భార్య భారతి ఆయన అబద్ధాలలో సగం అని నిరూపించుకున్నారు అంటూ వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఇదే సమయంలో జగన్ రెడ్డి అబద్ధపు హామీలు ఇచ్చి అమలు చేయని వాటిని అమలు చేస్తున్నట్లుగా భారతి గారు, ప్రచారం చేయడం ప్రజలను వంచించడమే అవుతుంది అంటూ వంగలపూడి అనిత విమర్శించారు. జగన్ మాత్రమే కాదు ఆయన సతీమణి కూడా రంగంలోకి దిగి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు.

ఆ హామీలు నెరవేరేలా భారతి జగన్ గారిని ఒప్పించాలన్న అనిత
45 ఏళ్లు దాటితే పింఛను, ఇంట్లో ఇద్దరు పిల్లలు బడికి వెళ్తే ఇద్దరికీ అమ్మ ఒడి ఇస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి భార్య హోదా లో అవాస్తవ ప్రచారం చేస్తున్న భారతి గారు... జగన్ గారు మాట తప్పిన ఈ రెండు హామీలు అమలు చేయాలని చెప్పి ఒప్పించాలని బాధ్యత మీదే నంటూ అనిత వైయస్ భారతి రెడ్డికి సూచించారు. 45 ఏళ్ళు దాటిన వారికి పించన్ ఇవ్వటం లేదని, అమ్మ ఒడి పథకంలో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ అమ్మ ఒడి రావటం లేదని అవి వచ్చేలా భారతి చొరవ చూపించాలని తన ట్వీట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications