మరో మాజీమంత్రి అరెస్టు తప్పదా? టీడీపీలో వర్గపోరు: సీనియర్ నేత హత్యకు కుట్ర: ఎస్పీకి చేరిన
కడప: తెలుగుదేశం పార్టీలో మొదలైన వర్గపోరు.. మాజీమంత్రి అరెస్టుకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు మాజీమంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు. విచారణను ఎదుర్కొంటున్నారు. అదే జాబితాలో మరో మాజీ కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. దీనికి కారణం మాత్రం తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గపోరే కారణం. సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. క్రమంగా అరెస్టులకు దారి తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఇప్పటికే ఈఎస్ఐ కుంభకోణంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడు, హత్యకేసులో కొల్లు రవీంద్ర అరెస్టు అయ్యారు. తాజాగా మరో మాజీమంత్రి భూమా అఖిలప్రియ హత్యారోపణలను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య నెలకొన్న వివాదాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. తనను హత్య చేయడానికి అఖిలప్రియ కుట్రపన్నారంటూ బహిరంగంగా విమర్శలను గుప్పిస్తూ వచ్చిన ఆయన ఈ సారి..ఫిర్యాదుల దాకా వెళ్లారు. భూమా అఖిలప్రియ నుంచి తనకు ప్రాణహాని ఉందని, వెంటనే ఆమెను అరెస్టు చేయాలని కోరుతూ ఏవీ సుబ్బారెడ్డి విజ్ఙప్తి చేశారు.

దీనిపై ఆయన కడప జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అన్బురాజన్‌ను కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. తనను హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అయిదుమందిని పోలీసులు అరెస్టు చేశారని, భూమా అఖిలప్రియ ఇంకా బయటే తిరుగుతున్నారని అన్నారు. ఈ కేసులో అఖిలప్రియను ఏ4 పోలీసులు గుర్తించారని చెప్పారు. ఆమెను మినహాయించి అయిదుమందిని అరెస్టు చేశారని చెప్పారు. ఏ1 సహా ఏ6 వరకు అందరినీ అరెస్టు చేసినా.. ఏ4గా ఉన్న అఖిలప్రియను అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోందని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.
అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అఖిల ప్రియ తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారనే విషయం ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శించారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కుటుంబం రాజకీయంగా తనను ఎదుర్కొనలేకపోతోందని, అందుకే హత్య చేయడానికి కుట్ర పన్నారని విమర్శించారు. తనను హత్య చేయించడానికి భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ కిరాయి హంతకులను నియమించారని, వారికి సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులోనే తేలిందని అన్నారు.
Recommended Video
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications