విషాదం.. దేవినేని నెహ్రూ కన్నుమూత, బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5.20 గంటలకు తుది శ్వాస విడిచారు.
ఆయన కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. నెహ్రూ 5సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంకిపాడు నుంచి 4సార్లు, విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 1994 నుంచి 1996 వరకు మంత్రిగా పని చేశారు. విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు. ఇప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున టిడిపి నేత గద్దె రామ్మోహన రావుపై పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబట్టింది లేదు. కానీ రాజకీయాల్లో ఉండాలంటే ఏదో పార్టీ ఉండాలి కాబట్టి అలాగే ఉండిపోయారని అంటారు.
కానీ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారని చెబుతుంటారు. 2004లో గెలిచినా మంత్రిగా కాలేదు. కృష్ణా జిల్లాకే పరిమితం అయ్యేవారు. 2014లో మాత్రం ఓడిపోయారు. అనారోగ్యం కారణంగా దేవినేని నెహ్రూ తన కొడుకును రాజకీయాల్లోకి ప్రధానంగా తెరపైకి తీసుకు వచ్చారు.
నెహ్రూకు కూతురు, కొడుకు ఉన్నారు. దేవినేని నెహ్రూ మృతి చెందిన విషయం తెలిసిన మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, తనయుడు దేవినేని అవినాష్, కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications