రోజా! టిడిపిలో మగాళ్లు లేరంటున్నావ్, టెస్టింగ్ ఏజెన్సీ పెట్టావా: గాలి
విజయవాడ: తెలుగుదేశం పార్టీలో మగాళ్లు లేరా, అందుకే మా పార్టీలో నుంచి తీసుకుంటున్నారా అని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా కౌంటర్ ఇస్తున్నారు. మంగళవారం నాడు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు రోజా పైన నిప్పులు చెరిగారు.
టిడిపిలో మగాళ్లు లేరని రోజా అంటున్నారని, రోజా ఏమైనా టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారా అని గాలి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఆడ - మగ తేడా లేదని, అందరూ సమానమేనని సూచించారు. రోజా ఎక్కడ ఉన్నా ఆమెది ఐరన్ లెగ్ అన్నారు. బాలనాగిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, రోజాలను నాడు ఎంతకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో బిజెపి సొంతగా పోటీ చేస్తుందనే ఊహాగానాలపై స్పందించారు. 2019లో సొంతంగా పోటీ చేయాలని బిజెపి నేతలు అనుకుంటే మంచిదే అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామంటే తమకు టిడిపి నేతలు అడ్డుపడుతున్నారని బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
బిజెపి నేతల అభివృ ద్ధి కార్యక్రమాలకు అడ్డుపడాల్సిన అవసరం తమకు లేదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ప్రతి ఏడాది రూ.100 కోట్లు భిక్షం వేస్తున్నారని, ఇప్పటి వరకు రాజధానికి సరైన నిధులు కేటాయించలేదన్నారు.












Click it and Unblock the Notifications