భగ్గుమన్న ఫాక్షన్ కక్షలు: ఇంటి ముందే టిడిపి కార్యకర్త దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం రామకృష్ణాపురంలో పాతకక్షలు మరోసారి భగ్గుమన్నాయి. తెలుగుదేశం కార్యకర్త వల్లూరి నగేష్(35)ను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. ఆ తర్వాత దండగులు పారిపోయారు.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు నమోదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు హత్యచేసి పారిపోయిన నిందితులకోసం గాలిస్తున్నారు. అరగంట ముందు నగేష్ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు.

కాపు కాసిన ప్రత్యర్థులు మొదట రాళ్లతో దాడి చేసిన దుండగులు అతని కిందపడిపోవడంతో వేటకొడవళ్లతో నరికి చంపారు. నగేష్ ఇంటిముందే ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ప్రత్యర్థులు దాడికి దిగడానికి యత్నిస్తారేమోనని పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు.
మృతుడు నగేష్ గతంలో జరిగిన ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రతికారంతోనే ప్రత్యర్థులు అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications