ఇంజనీరింగ్ పరీక్షల్లో లోకేష్ కు సంబందించిన ప్రశ్నలు

కాకినాడ :కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ విధ్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు సంబందించిన ప్రశ్నలు ప్రశ్నపత్రంలో చోటుచేసుకోవడంతో విధ్యార్థులు బిత్తరపోయారు.ఈ ఘటనపై జెఎన్ టియూ విసి పరీక్షల విభాగాన్ని వివరణ కోరారు.

ఇంజనీరింగ్ విధ్యార్థులకు సెకండియర్ సెమిస్టర్ పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలను అబ్బుపర్చాయి.కంప్యూర్ సైన్స్ విభాగంలో సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాస్తోన్న విధ్యార్థులకు ప్రశ్నపత్రంలో లోకేష్ ను గురించిన ప్రశ్నలు చోటుచేసుకొన్నాయి.

Tdp leader lokesh related questions in engineering exams

సోమవారం నాడు మెనేజేరియల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ పరీక్ష ప్రశ్నపత్రంలో జర్నల్ ఎంట్రీ రికార్డింగ్ విధానానికి సంబందించి లోకేష్ ను గురించి ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నలో లోకేష్ బ్యాంక్, హెరిటెజ్ లిమిటెడ్, బ్రహ్మణి లిమిటెడ్ అంటూ ప్రశ్నపత్రం తయారు చేశారు .ఈ ప్రశ్నతో విధ్యార్థులు గందరగోళానికి గురయ్యారు.

సబ్జెక్ట్ కు సంబందం లేని ప్రశ్నలు రావడం పట్ల విధ్యార్థులు విస్మయం వ్యక్తం చేశారు.లోకష్ సబందించిన ప్రశ్నలు ఈ పరీక్షలో రావడం పట్ల జెఎన్ టియూ వైస్ చాన్సిలర్ పరీక్షల విభాగాన్ని వివరణ కోరారు.అయితే ఈ ప్రశ్నలు పరీక్షల్లో రావడాన్ని పరీక్షల విభాగం తేలిగ్గా కొట్టిపారేసింది. ప్రత్యేక ఉద్దేశ్యాలు తమకు లేవని చెబుతున్నారు పరీక్షల విభాగం అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+