పవన్ ను "భుజాల పై మోస్తాం "- సీట్లు ఆఫర్ చేస్తున్న టీడీపీ నేతలు..!!
ఏపీలో పొత్తుల రాజకీయం కీలక మలుపు తీసుకుంటోంది. టీడీపీ - జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. సుదీర్ఘ మంతనాలు కొనసాగుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును అడ్డుకొని పోలీసులు ఇబ్బంది పెట్టారని..సంఘీభావం ప్రకటించేందుకు పవన్ వెళ్తున్నారని రెండు పార్టీలకు అందిన సమాచారం. కానీ, ఇద్దరు నేతలు ఒన్ టు ఒన్ భేటీ కొనసాగుతోంది. రెండు పార్టీల్లోనూ పొత్తు ఖాయమనే అభిప్రాయంతో ఉన్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి పవన్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయి. తమ భుజస్కందాలపైన పవన్ మోసి గెలిపిస్తామంటూ టీడీపీ నేతలు ముందుకొస్తున్నారు.

పవన్ కు టీడీపీ నేత ఆఫర్
అటు చంద్రబాబు - పవన్ భేటీ కొనసాగుతున్న వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని విశ్వసిస్తున్నా.. బయటకు మాత్రం కొంత డైలమా కనిపిస్తోంది. ఇప్పుడు చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లటం ద్వారా టీడీపీతో కలిసి కొనసాగేందుకే పవన్ సిద్దంగా ఉన్నారనే బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి.
వైసీపీ ఓడించాలనేది ఇప్పుడు టీడీపీ..జనసేన ముఖ్య నేతల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో, పవన్ వచ్చే ఎన్నికల్లో తమ స్థానాల నుంచి పోటీ చేయాలని టీడీపీ సీనియర్లు కోరుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా ఓడిపోయారు. ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారనేది అధికారికంగా స్పష్టత రాలేదు. దీంతో, తాజాగా టీడీపీ అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

అనంతపురం నుంచి పవన్ పోటీ చేస్తే..
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని ప్రభాకర్ చౌదరి చెప్పుకొచ్చారు. తన భుజస్కందాల మీద మోసి గెలిపిస్తానంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమి.. జగన్ ఇంటికి పోవటం తమ రెండు పార్టీల లక్ష్యమని స్పష్టం చేసారు. జనసేనతో తమ బంధం కొత్తది కాదని.. గతంలోనే పొత్తు ఉన్న పార్టీగా వివరించారు.
ఎన్నికల సమయంలో పొత్తులు అనేది అప్పడు ఉన్న పరిస్థితులు అధారంగా ఉంటాయని విశ్లేషించారు. ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లు అయింది. పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం పైన అనేక రకాల అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో ఇప్పుడు ప్రభాకర్ చౌదరి చేసిన ప్రతిపాదన రెండు పార్టీల్లోనూ చర్చకు కారణమవుతోంది.

జనసేనాని పోటీకి సిద్దమేనా
ఇదే సమయంలో ప్రభాకర్ చౌదరి వ్యాఖ్యల పైన మరో ఆసక్తి కర చర్చ సాగుతోంది. అనంతపురం లో ప్రభాకర్ చౌదరి వర్సస్ జేసీ బ్రదర్స్ అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి సీటు రాకుండా తెర వెనుక రాజకీయం చోటు చేసుకుంది. చివరకు టికెట్ దక్కించుకున్న ప్రభాకర్ చౌదరి వైసీపీ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డి చేతిలో పరాజం పొందారు.
వచ్చే ఎన్నికల్లో తిరిగి అనంతపురం సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు పవన్ కు సీటుకు ఆఫర్ చేయటం ద్వారా పరోక్షంగా జేసీ బ్రదర్స్ పైన పై చేయి సాధించే ప్రయత్నాలు మొదలు పెట్టారనే విశ్లేషణలు మొదలయ్యాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications