‘పవర్’ ఉంటే చాలు: జంటిల్మెన్ ఒప్పందం అమలుకు తమ్ముళ్లు ‘నో’.. మైనారిటీలోనూ మున్సిపల్ చైర్మన్‌కోసం పట

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అమరావతి: అధికారంలో ఉండే మజానే వేరు. ఇక పదవిలో ఉన్నవారి స్టయిల్ డిఫరెంట్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామం ఇది. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు అంతా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2014లో సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలంలో టీడీపీ ఆధిక్యం సాధించినా.. మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు నేతలు పోటీ పడ్డారు.
దీంతో సీనియర్ నేతలు జెంటిల్మెన్ ఒప్పందం అమలు చేశారు. కానీ దాని ప్రకారం ఎంపీపీగా వైదొలిగేందుకు సదరు రెడ్డి వెంకన్న తేల్చేశారు. దీంతో ప్రత్యర్థి గ్రూపు ఆందోళనకు దిగింది. మరోవైపు క్రుష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కౌన్సిల్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉండటంతో కేసుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. కోరం లేకపోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక శనివారానికి వాయిదా పడింది.

 లక్కవరపు కోటలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య పోటీ

లక్కవరపు కోటలో ఇద్దరు టీడీపీ నేతల మధ్య పోటీ

2014 ఏప్రిల్‌లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలంలో టీడీపీ ఆధిక్యం సాధించింది. ఎంపీపీ పదవికి ఇద్దరు పోటీపడ్డారు. అందులో రెడ్డి వెంకన్నకు ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శోభా హైమావతి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వాతిరాణి అండదండలు ఉన్నాయి. మరో వ్యక్తి మండల పార్టీ అధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌కు ఎమ్మెల్యే లలితకుమారి అండ ఉంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వీరిద్దరూ మండలంలో కీలక నేతలే. అప్పట్లో సమస్య పరిష్కారం కోసం జంటిల్మన్‌ ఒప్పందం పేరుతో చెరో రెండున్నరేళ్లపాటు పదవిలో ఉండాలని, మొదట అవకాశం రెడ్డి వెంకన్నకే ఇస్తూ తీర్మానించారు. 2017 జనవరి 5వ తేదీతో ఆయన గడువు ముగిసింది. దీని ప్రకారం ఎంపీపీ పదవి తనకు ఇవ్వాలని చంద్రశేఖర్‌ పట్టుబడుతూ వచ్చారు. మండల పరిషత్‌ ఎన్నికల సమయంలో నిర్ణయించుకున్న ప్రకారం జెంటిల్మన్‌ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం తెలుగు తమ్ముళ్లు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇంటిముందు ఆందోళనకు దిగారు.

సమావేశాలకు గైర్హాజరుతో ప్రత్యర్థి గ్రూప్ సభ్యులపై అనర్హత వేటు?

సమావేశాలకు గైర్హాజరుతో ప్రత్యర్థి గ్రూప్ సభ్యులపై అనర్హత వేటు?

దీనిపై ఇప్పటికే మంత్రుల సమక్షంలో మూడు సార్లు పంచాయతీ నిర్వహించినా పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేనని రెడ్డి వెంకన్న తెగేసి చెప్పారు. అయనపై చర్యలు తీసుకునేందుకు టీడీపీ నేతలు సాహసం చేయలేకపోవడంతో వివాదం అలాగే కొనసాగుతోంది. దీనికి నిరసనగా చంద్రశేఖర్‌ తన అనుయాయులతో కొంతకాలంగా మండల సమావేశాలకు సైతం గైర్హాజరవుతున్నారు. మరోసారి గైర్హాజరైతే చట్టరీత్యా పదవులు కోల్పోవాల్సి వస్తుందని అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్న చంద్రశేఖర్‌ 400 మంది మద్దతుదారులతో శుక్రవారం ఎమ్మెల్యే లలితకుమారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారిని శాంతపరచి పంపేశారు. కాగా వీరి ఆందోళనకు ముందే ఎంపీపీ రెడ్డి వెంకన్న ఎమ్మెల్యే లలితకుమారిని కలసి తాను పదవిని వీడేది లేదనీ, అవసరమైతే తనను పార్టీనుంచి సస్పెండ్‌ చేయమని కూడా సవాల్‌ విసిరారని తెలిసింది.

 కేసులు తిరగదోడతామని తెలుగు తమ్ముళ్ల హెచ్చరికలు

కేసులు తిరగదోడతామని తెలుగు తమ్ముళ్ల హెచ్చరికలు

జగ్గయ‍్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడటంతో టీడీపీ మరో కుట్రకు తెరలేపింది. ప్రలోభాలకు లొంగని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలను బెదిరింపులతో అదుపులోకి తెచ్చుకోవాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కౌన్సిలర్లు తమకు మద్దతు ఇవ్వకుంటే కేసులు తిరగదోడతామంటూ, పార్టీ ఫిరాయించి మద్దతిస్తే కేసులు మాఫీ చేస్తామని టీడీపీ సంకేతాలు పంపిస్తోంది. తాము చెప్పినట్లు వినకుంటే నలుగురు కౌన్సిరల్లను అరెస్ట్‌ చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక టీడీపీ నేతల హైడ్రామా నేపథ్యంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక శనివారానికి వాయిదా పడింది. ఎన్నిక వాయిదాపై రిటర్నింగ్‌ అధికారి హరీశ్‌ మాట్లాడుతూ ‘కౌన్సిల్‌లో జరిగిన పరిణామాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు కోరం ఉన్నా ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. సర్దిచెప్పినా కొంతమంది సభ్యులు వినిపించుకోలేదు. శనివారం ఉదయం ఎన్నిక నిర్వహిస్తాం' అని తెలిపారు.

 ఉదయ భాను సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అరెస్ట్

ఉదయ భాను సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల అరెస్ట్

మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వ్యవహారంలో కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను అన్నారు. టీడీపీ నేతలు రిటర్నింగ్‌ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక వాయిదా వేయించారని ఆరోపించారు. కోరం ఉన్నా వాయిదా వేయడంలో మతలబు ఏంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నెల రోజుల నుంచి ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నా తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. అందుకే టీడీపీ నేతలు కౌన్సిల్‌లో విధ్వంసానికి దిగారని మండిపడ్డారు. తమ పార్టీ కౌన్సిలర్లకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సామినేని ఉదయభాను డిమాండ్‌ చేశారు. కాగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. నిరసనలో పాల్గొన్న సామినేని ఉదయభాను సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 బుకాయింపులు బయట పడటంతో కౌన్సిలర్లు

బుకాయింపులు బయట పడటంతో కౌన్సిలర్లు

కిడ్నాపయ్యారంటూ ఆందోళనవైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యులు ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకోవాలని టీడీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. అధికారులు, ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. ఇద్దరు టీడీపీ మహిళ నాయకులను కౌన్సిలర్లుగా చూపిస్తూ మున్సిపల్‌ హాలులోకి టీడీపీ నేతలు తీసుకెళ్లే ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నేతల అసలు రంగు బయటపడింది. దీంతో కౌన్సిల్‌ హాలులోని టేబుళ్లను పడేసి, విధ్వంస కాండకు దిగారు. మున్సిపల్ ఆఫీసు ముందు పార్క్ చేసిన మోటార్ బైక్‌ను టీడీపీ నేతలు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఈ తతంగం సీసీ ఫుటేజ్‌లో రికార్డవడంతో తమ కౌన్సిలర్లు ఇద్దరు మాయమయ్యారని ఎన్నిక వాయిదా వేయాలని పట్టుపట్టారు. ఈ గందరగోళంలో అధికారులు చైర్మన్ ఎన్నిక కాసేపు వాయిదా వేసినప్పటికి వ్యవహారం సద్దుమణగకపోవడంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఛైర్మన్ ఎన్నికల వాయిదా వేయడంపై వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలతో తమ కౌన్సిలర్లను టీడీపీ నేతలు కొనాలని చూశారని...కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని మండిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leaders style different in Andhra Pradesh. In 2014 MPTC elections TDP wins mejority seats in Lakkavarapu Kota mandal Vijaya Nagaram District. But Two leaders competete for MPP post. Then TDP Seniors creates Jentlement agreement with compiteters. But Present MPP Reddy Venkanna didn't ready to resign his post and he dared MLA to suspend him. Another side TDP minority in Jaggayapet muncipality but its leaders blackmailed YSR Congress party leaders.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి