విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి మాటేమిటి?: పవన్‌కు టీడీపి దిమ్మతిరిగే కౌంటర్, 'జగన్‌పై నా కూతురు పోటీ'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ కళ్యాణ్ పై జలీల్ ఖాన్ మండిపాటు

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి నారా లోకేష్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బోడె ప్రసాద్ మంగళవారం కౌంటర్ ఇచ్చారు. పవన్, కన్నాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కన్నా లక్ష్మీనారాయణ ర్యాలీల్లో సంఘ విద్రోహ శక్తులు పాల్గొంటున్నాయని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై కన్నా తన పరిమితికి మించి మాట్లాడుతున్నారన్నారు.

క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను, అందుకే అభిమాన సంస్థ పెట్టలేదు: చిరంజీవి ఫ్యాన్స్‌తో పవన్క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాను, అందుకే అభిమాన సంస్థ పెట్టలేదు: చిరంజీవి ఫ్యాన్స్‌తో పవన్

పవన్‌కు కౌంటర్.. చిరంజీవిని లాగిన బుద్ధా వెంకన్న

పవన్‌కు కౌంటర్.. చిరంజీవిని లాగిన బుద్ధా వెంకన్న

చంద్రబాబు అవినీతిని నిరూపించగలరా అని కన్నాకు బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. తాము కన్నా లక్ష్మీనారాయణ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు బీజేపీని ఏమాత్రం ఆదరించరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి రాజ్యసభ ద్వారానే మంత్రి అయిన విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరిచిపోయారా అని ప్రశ్నించారు. లోకేష్ పైన పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్‌నే చదువుతున్నారన్నారు.

జగన్‌పై నా కూతురు పోటీ చేస్తుంది

జగన్‌పై నా కూతురు పోటీ చేస్తుంది

వైసీపీ అధినేత జగన్ ఏపీకి సైతాన్‌లా తయారయ్యారని టీడీపీ నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. తనను తాను రక్షించుకునేందుకు జగన్ పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుమతిస్తే కన్నా లక్ష్మీనారాయణపై తాను, జగన్ పైన తన కూతురు పోటీ చేస్తుందని చెప్పారు.

 పవన్ మీరేం చేశారో అందరికీ తెలుసు

పవన్ మీరేం చేశారో అందరికీ తెలుసు

పవన్ కళ్యాణ్ పైన జలీల్ ఖాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్, జగన్, కన్నా లక్ష్మీనారాయణ చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసునని చెప్పారు. పవన్ ఓ దొంగ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు మెగా ఫ్యామిలీ ఏం చేసిందో అందరికీ తెలుసునని, పీఆర్పీని ముంచి మంత్రి తీసుకున్న చరిత్ర చిరంజీవిది అన్నారు. మోడీ వద్ద ముగ్గురు దొంగలు కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారన్నారు.

 రోజా సారీ చెప్పాలి

రోజా సారీ చెప్పాలి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మంగళవారం డిమాండ్ చేశారు. తాను రోజాపై చేసిన అన్ని వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. కాల్ మనీ కేసులో పోలీసుల అత్యుత్సాహం, వైఫల్యం ఉందని చెప్పారు. ఓ వ్యక్తికి సంబంధించిన విషయాన్ని మొత్తం రాష్ట్రానికి ఆపాదించారన్నారు.

English summary
Telugudesam party leaders target Jana Sena chief Pawan Kalyan for his comments on Minister Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X