గడపగడపలో ఛీత్కారం.. వీడియోలు పెట్టి మరీ వైసీపీ పరువు తీస్తున్న టీడీపీనేతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడపగడపకు ప్రభుత్వం అంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రజా ప్రతినిధులు ప్రజల వద్దకు నేరుగా వెళ్లాలని నిర్ణయించి గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐదేళ్లకొకసారి ఎన్నికల సమయంలోనే ఓటర్ల గడప తొక్కే ప్రభుత్వం తమది కాదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం ప్రజల్లోనే ఉండే ప్రభుత్వం తమదని చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పక్కా ప్లాన్ తో వెళ్లాలని భావించిన వైసీపీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇక వైసీపీ కార్యక్రమం టీడీపీ నేతలకు ఆయుధంగా మారింది.

వైసీపీ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్న టీడీపీ
గడపగడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం వైసీపీకి లబ్ధి చేకూరుస్తుందని భావిస్తే ఊహించని విధంగా అడుగడుగునా నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి. ఇక అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల వద్ద వైసిపి ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న వ్యతిరేకతకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వైసీపీ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
తాగునీటి సమస్యపై నిలదీసిన వీడియో షేర్ చేసిన టీడీపీ
గడప గడపలో ప్రభుత్వంపై ప్రజాగ్రహం చోటు చేసుకుంటుందని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న ప్రభుత్వ వ్యతిరేకతను సోషల్ మీడియా వేదికగా కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గడప గడపకీ ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మీర్జాపురంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు నిలదీశారని తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోని షేర్ చేసి మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని, ప్రజల వద్ద ఎమ్మెల్యేల కు ఎదురవుతున్న వ్యతిరేకతను తెలియజేసింది.
ఆ వీడియోలతో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన టీడీపీ మహిళా నాయకులు
ఇక టిడిపి మహిళా నాయకురాళ్ళు వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాధ గడప గడపలో చీత్కారం అంటూ మహిళలు ఎమ్మెల్యేలను సమస్యలపై ప్రశ్నించి మండిపడుతున్న వీడియోలను పోస్ట్ చేశారు. మీకు చెప్పినా ఒక్కటే, గోడకు చెప్పినా ఒక్కటే. ఆదోనిలో మహిళ రియాక్షన్. ప్రజలకు మీ సీన్ అర్ధమై పోయింది అంటూ వంగలపూడి అనిత వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఇక పంచుమర్తి అనురాధ ప్రజా వ్యతిరేకత ఇంకా తీవ్రం అవుతోందని, ప్రజలు వైసిపి మంత్రులను, నేతలను నిలదీస్తున్న వీడియోను షేర్ చేశారు.
మోసపోయామని జనాలు అంటున్నారు జగన్ అంటూ గోరంట్ల బుచ్చయ్య సెటైర్
మోసపోయామని జనాలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓ ఆసక్తికరమైన కామెడీ సీన్ ను షేర్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను అదేవిధంగా మోసం చేశారని పోస్ట్ చేశారు. గడపగడపకు ప్రభుత్వం అంటూ అధికారులను, పోలీసులను వెంటబెట్టుకుని వైసీపీ నేతలు తిరుగుతుంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రజలు సమస్యలు పరిష్కారం కావడం లేదని, మంత్రుల ముందు, ఎమ్మెల్యేల ముందు సమస్యల చిట్టాలు ఏకరువు పెడుతున్నారు. మీరు చేసింది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
కరెంట్ సమస్యపై, తాగునీటి కష్టాలపై, ఛార్జీల పెంపుపై, నాటు సారా అమ్మకాలపై.. ఇలా ఒకటేంటి అనేక సమస్యలపై ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. ఇక ఈ వీడియోలను తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications