వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రానికి జగన్ పెద్ద వైరస్.. తరిమికొడితేనే భవిషత్తు.. ఎన్టీఆర్ వర్థంతిలో టీడీపీ నేతలు

|
Google Oneindia TeluguNews

రాష్ట్రానికి పట్టిపీడిస్తున్న అతిపెద్ద వైరస్ సీఎం జగన్ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు విమర్శలు గుప్పించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువ‌త‌ బయటకు వచ్చి జగన్ వైరస్‌ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్థంతిని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళల్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానేత విగ్రహానికి అచ్చెన్నాయుడుతో పాటు పార్టీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి నివాళుల్పించారు. ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

పేద , బడుగువర్గాలు అభ్యున్నతికి కృషి చేసిన‌ మహానుభావుడు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సంక్షేమానికి పెద్ద పీట వేశారని పేర్కొన్నారు. పెన్షన్ పథకాన్ని 35 రూపాయలతో ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ప్రస్తుత వైసీపీ పాలనలో ఏ వర్గం వారు సంతోషంగా లేరని ఆరోపణలు గుప్పించారు.

పన్నులతో ప్రజలను పీడిస్తున్నారని విమర్శించారు. రాక్షస పాలనలో జనం బతుకులు చిన్నాభిన్నమైయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జగన్ వైరస్‌ను పారదోలేందుకు మువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని అన్నారు.

ఏపీలో కన్ప్యూజన్ పాలన

ఏపీలో కన్ప్యూజన్ పాలన

ఏపీలో కన్ప్యూజన్ పాలన నడుస్తుందని విమర్శించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు. తెలుగుదేశం పాలన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు రాష్ట్రంలో కన్పించడంలేదని మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకోని విజయనగరం జిల్లాలోని కోట జంక్షన్‌లో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళుల్పించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విరుచుకుపడ్డారు. ప్రార్ధనా స్థలాలకు వెళితే కరోనా పెరుగుతుందట.. మరి స్కూల్స్‌కి వెళితే పెరగదా ? అని ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ధంగా పాలన సాగడంలేదని విమర్శించారు. ప్రజలంతా కరోనాని బంధనలు పాటిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్..

దేశంలో కొత్త చరిత్ర సృష్టించిన మహానేత నందమూరి తారక రామారావు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన.. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడని కొనియాడారు. రాజకీయంగా కొత్త తరానికి తెరలేపిన ఆదర్శనేతని అని పేర్కొన్నారు. తన లాంటి వారికి ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రప్తాదించారని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గపు పాలనలో ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయని విమర్శించారు.

చంద్ర‌బాబు, లోకేష్‌కి క‌రోనా..

చంద్ర‌బాబు, లోకేష్‌కి క‌రోనా..

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకావాల్సి ఉంది. అయితే చంద్రబాబుకి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కి కరోనా కరోనా సోకింది. వారిద్ద‌రూ హోం ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో పార్టీ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. చంద్రబాబు, లోకేశ్‌ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్ద‌న్నారు టీడీపీ నేత‌లు. త్వరలోనే ఇద్దరు కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాని తెలిపారు.

English summary
TDP Leaders Slams to CM Jagan mohan Reddy..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X