తాడేపల్లిలోనే జగన్ కొంప .. టీడీపీ వార్నింగ్ ; జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు, అన్ని దారులు మూసివేత

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి ముట్టడికి యత్నించిన వైసీపీ నేతల ఆందోళనతో చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో తాజా ఘటనలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న వేళ సీఎం జగన్ ఇంటి వద్ద భద్రత పెంచారు. టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్న నేపధ్యంలో అన్ని దారులను మూసేశారు.

అయ్యన్న వ్యాఖ్యల ఎఫెక్ట్ .. చంద్రబాబు ఇంటి వద్ద హైడ్రామా

అయ్యన్న వ్యాఖ్యల ఎఫెక్ట్ .. చంద్రబాబు ఇంటి వద్ద హైడ్రామా

నిన్న కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసిపి నేతలు ఈరోజు చంద్రబాబు ఇల్లు ముట్టడికి యత్నించారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీగా చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారం బయట ఆందోళనకు దిగారు. దీంతో టిడిపి నేతలకు వైసీపీ నేతలకు మధ్య బాహాబాహి చోటుచేసుకుంది.

టీడీపీ వర్సెస్ వైసీపీ .. రాళ్ళ దాడి, పోలీసుల లాఠీ చార్జ్

టీడీపీ వర్సెస్ వైసీపీ .. రాళ్ళ దాడి, పోలీసుల లాఠీ చార్జ్


ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో, ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రమేష్ కారు అద్దం పగిలింది. ఎమ్మెల్యే జోగి రమేష్ కు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు తోపులాట జరగడంతో బుద్ధ వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను అదుపు చేసి ఉద్రిక్తతను చల్లారేలా చేశారు.

 జగన్ తాడేపల్లి కొంప అంటూ తెలుగు తమ్ముళ్ళ వార్నింగ్

జగన్ తాడేపల్లి కొంప అంటూ తెలుగు తమ్ముళ్ళ వార్నింగ్

ఇక ఈ ఘటనపై తెలుగు తమ్ముళ్లు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. రాజకీయ విమర్శలు తట్టుకోలేకపోతే ఇళ్ళ మీద దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం ఉంటుందో, ఆ ఇంటికి ఈ ఇల్లు అంతే దూరం ఉంటుందని వైసిపి నేతలను హెచ్చరించారు. తాడేపల్లిలో జగన్ కొంప నుండి చంద్రబాబు నివాసానికి, చంద్రబాబు నివాసం నుండి జగన్ కొంపకు అంతే దూరం ఉంటుందని, తాము కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేయగలమని దాడులకు దిగగలమని, కాకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సంయమనం పాటించండి అని చెప్పడంతో సైలెంట్ గా ఉన్నామని ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే బాగుంటుందని హెచ్చరించారు.

జగన్ ఇంటివద్ద భారీ బందోబస్తు .. అన్ని మార్గాలు మూసివేత

జగన్ ఇంటివద్ద భారీ బందోబస్తు .. అన్ని మార్గాలు మూసివేత


ఇక చంద్రబాబు ఇంటి పై వైసిపి గుండాలు దాడి చేశారని ఆరోపిస్తున్న తెలుగు తమ్ముళ్లు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబుకి రక్షణ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సీఎం జగన్ నివాసం వైపు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేసి, ఎలాంటి ఆందోళన చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు. సీఎం జగన్ నివాసామ్ వైపు వెళ్ళే అన్ని మార్గాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు ఇక ట్రాఫిక్ ను జాతీయ రహదారిపైకి మళ్లించారు.

Recommended Video

    Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
    టీడీపీ ఆందోళనలకు ఛాన్స్ ... అడుగడుగునా పోలీసుల నిఘా

    టీడీపీ ఆందోళనలకు ఛాన్స్ ... అడుగడుగునా పోలీసుల నిఘా

    టిడిపి కార్యకర్తలు జగన్ నివాసం వద్ద ఆందోళనలకు దిగే అవకాశం ఉందని ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను చేపట్టిన పోలీసులు జగన్ ఇంటి వైపు వెళ్లే మార్గాలన్నింటినీ మూసివేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి, అడుగడుగునా నిఘా పెట్టారు. మరి ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో మరి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+