వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ఉప నాయకులను ప్రకటించిన టీడీపీ...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్న నేపథ్యంలో టీడీపీ శాసన సభ ఉప నాయకులను ప్రకటించింది.టీడీఎల్పీ నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే పార్టీ ఉప నాయకులుగా ముగ్గురిని ప్రకటించింది. వీరిలో కే.అచ్చనాయుడు, జీ.బుచ్చయ్య చౌదరీ, నిమ్మల రామానాయుడులను నియమించారు. కాగా డీ. బాలా వీరాంజనేయ స్వామిని పార్టీ విప్‌గా ప్రకటించారు. ఈ జాబితాకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్ రావు లేఖను ఏపి అసెంబ్లీ సెక్రటరీకి పంపించారు.

TDP,Assembly,chabdrababu naidu, ఏపీ అసెంబ్లీ, చంద్రబాబు నాయుడు, టీడీపీ,

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో బుధవారం ఉదయం 11.05 గంటలకు 15వ అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. ప్రొటెం స్పీక‌ర్ శంబంగి చిన అప్ప‌ల‌నాయుడు స‌భ‌కు ఎన్నికైన ఎమ్మెల్యేల‌తో ప్ర‌మాణం చేయిస్తారు. ముందుగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రమాణం చేస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.

మరుసటీ రోజు మిగిలిన కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. 14న ఉభయసభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. మరోవైపు శాసన మండలి సమావేశాలు కూడా 14 నుంచే ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో జ‌గ‌న్‌.. ప్రతిప‌క్ష నేత హోదాలో చంద్రబాబు ఈ స‌మావేశాల‌కు హాజ‌రు కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్‌.. విప్‌ల‌ను సైతం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే..

English summary
TDP Legislative Assembly deputy leaders announced on Wednesday that Assembly meetings in Andhra Pradesh will be held on Wednesday. Achem naidu,G. Bachchiyya Chaudhary, Nimmala Ramanaidu appointed as deputy floor leaders And Bala Veeranjaneya Swami declared as party whip
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X