కేసీఆర్ ఎఫెక్ట్: హైదరాబాద్‌కు రూటు మార్చిన చంద్రబాబు
హైదరాబాద్: మహానాడు 2015ను హైదరాబాదులో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ దాదాపు నిర్ణయించింది. మే 27వ తేదీ నుండి మూడు రోజుల పాటు వీటిని హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. చంద్రబాబు వ్యూహం ప్రకారమే మహానాడును హైదరాబాదులో నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో, గత ఏడాది మహానాడును హైదరాబాదులో నిర్వహించారు. దీంతో, ఈసారి మహానాడును ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలని టీడీపీ మొదట భావించింది. అయితే, టీడీపీ ఇప్పుడు రూటు మార్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదులో త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఈసారి మహానాడును హైదరాబాదులో నిర్వహించాలని భావిస్తున్నారు.

మొదట, మహానాడును విజయవాడలో నిర్వహించాలని భావించారు. అయితే, ఇటీవల గ్రేటర్ హైదరాబాదులోని పలువురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం, టీడీపీ బలహీనమవుతోందనే వాదనల నేపథ్యంలో.. తెలంగాణ తమ్ముళ్లలో కొత్త ఉత్సాహం తీసుకు రావడంతో పాటు, గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా మహానాడును హైదరాబాదులో నిర్వహిస్తున్నారని అంటున్నారు. తెలంగాణలో పలుచోట్ల మినీమహానాడులు కూడా నిర్వహించనున్నారు.
మరోవైపు, మహానాడుకు ఎవరెవరు వస్తారనే అంశంపై అప్పుడే చర్చ సాగుతోంది. టీడీపీ యువనేత నారా లోకేష్‌కు ఏమైనా ముఖ్య పదవి అప్పగిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఈ మహానాడుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన వస్తారా లేదా అనేది చూడాలి. మరోవైపు, హరికృష్ణ వస్తారా అనేది కూడా ఆసక్తికర అంశం.












Click it and Unblock the Notifications