పవన్ భుజాలపై తుపాకీ పెట్టి వైసీపీ ఎంపీని టార్గెట్ చేసిన టీడీపీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధీనంలో ఉండే శాఖపై తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసహనాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేశారు.

ఆ శాఖ- కాలుష్య నియంత్రణ మండలి. ఇది పవన్ కల్యాణ్ పరిధిలోకి వచ్చే అటవీ మంత్రిత్వ శాఖకు చెందినది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చాలా నిర్లక్ష్యంగా, అసలు ఉందా? లేదా? అన్నట్లు తయారైందని బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. పీసీబీ గానీ, అందులో ఉండే టాస్క్ ఫోర్స్ గానీ, మెంబర్ సెక్రెటరీ గానీ.. ఎక్కడ కూడా పని చేస్తోన్నట్లు కనిపించట్లేదని తేల్చి చెప్పారు. ఏదైనా పని కోసం వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారని పేర్కొన్నారు.

TDP MLA Bonda Uma made key remarks against PCB

డిప్యూటీ సీఎం చెయ్యొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన కలవట్లేదు.. అని స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మనే చెబుతున్నారని బొండా ఉమ తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించడానికి సంబంధించిన అంశాలపై పవన్ కల్యాణ్ చాలా మంచి విషయాలు చెప్పారని, దాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని అంటూనే.. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం గాడి తప్పినట్టు కనిపిస్తోందని చెప్పారు.

ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ ఒత్తిళ్లకు లోనవుతున్నట్లుగా తాను భావిస్తోన్నానని బొండా ఉమ అన్నారు. విశాఖపట్నంలో రాంకీ పరిశ్రమ నుంచి రసాయనిక, ఫార్మా వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి వదులుతున్నారని స్వయంగా పీసీబీ ఛైర్మన్ డాక్టర్ పీ కృష్ణయ్య స్వయంగా చెప్పారని, ఆయన తనిఖీ కూడా చేసి వచ్చారని పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా చర్యలు తీసుకోవట్లేదని వివరించారు.

రాంకీ ఛైర్మన్ అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ అని, ఆయనతో ఏ కాంటాక్ట్స్ ఉన్నాయో తెలియట్లేదని బొండా ఉమా వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో కూడా కాల్వలు నిండిపోయినా, విజయవాడలో కాలుష్య నియంత్రణ గురించి పట్టించుకోవట్లేదని తెలిపారు. పీసీబీ ఛైర్మన్ కు ఏదైనా రెప్రజెంటేషన్ ఇస్తే చాలామంది ఎమ్మెల్యేలను చూశానని సమాధానం ఇస్తోన్నారని, తామందరం గెలిస్తేనే ఆయన ఆ సీటులో కూర్చున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+