డీ లిమిటేషన్ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తుందిదే!
డీలిమిటేషన్.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రచ్చన్న యుద్దంగా మారింది. డీలిమిటేషన్ జరిగి జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరిగితే అది దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం ప్రధానంగా బిజెపియేతర రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో జేఏసీ సమావేశాన్ని నిర్వహించి డిలిమిటేషన్ ను వ్యతిరేకించిన జేఏసీ సభ్యులు, మరోమారు సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించాయి.
డీలిమిటేషన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు
ఈసారి రెండవ కు హైదరాబాద్ ను వేదిక చేశాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకుని ఏర్పాటుచేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డిలిమిటేషన్ విషయంలో సైలెంట్ గా ఉంది దీనిపైన చంద్రబాబు ఇప్పటివరకు నోరు మెదపలేదు. కానీ తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముందు ఆ పని చెయ్యాలన్న పవన్
ఇప్పటికే పవన్ కళ్యాణ్ దీనిపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ చెన్నైలో ఇటీవల జరిగిన సదస్సు పైన పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక ఈ సమస్య పైన ఎంపీలు ముందు పార్లమెంట్లో గళం విప్పాలని ఆ తర్వాతే పోరాటం చేయాలని సూచించారు.
టీడీపీ వైఖరిపై చర్చ వేళ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఇలా రోడ్లమీదకు వస్తే ఏ ప్రయోజనం ఉండదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి వైఖరి దీనిపైన ఏమిటి అని ప్రస్తుతం చర్చ జరుగుతున్న వేళ డీలిమిటేషన్ పైన టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంతో చంద్రబాబు, పవన్ అంతర్గత చర్చలు
ఎన్డీఏ కూటమిలో ఉన్నందున బహిరంగంగా మాట్లాడలేమని పేర్కొన్న ఆయన నియోజకవర్గాల పునర్విభజన పైన కేంద్రంతో చంద్రబాబు, పవన్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు.
జగన్ మళ్ళీ ఊచలు లెక్కబెట్టాల్సిందే
మూడేళ్ల తర్వాత జగన్ అధికారంలోకి వస్తానని చెబుతున్నారని, జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకేనని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన లిక్కర్, మైనింగ్ స్కాములు బయటకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. జగన్ మళ్ళీ ఊచలు లెక్కించాల్సిందేనని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications