ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ ఆ ఆంధ్ర .. సీఎం జగన్‌పై రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో సారి సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ పంచలు విసిరారు. పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు గుప్పించే వైసీపీ నేతలకు టిట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచి ముఖ్యమంత్రి కుర్చీని చంద్రబాబు లాక్కున్నారంటూ మంత్రుల దగ్గర నుంచి, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
మంత్రులకు కౌంటర్
తాజా అమరావతి విషయంలో చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారని మంత్రులు ఆరోపించారు. నాడు సీఎం కుర్చీకోసం తన సొంత మామ, టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచినట్లు ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి విషయంలో అన్నధాతలకు కూడా చంద్రబాబు వెన్నపోటు పోడుస్తున్నారని విమర్శించారు. వారి వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ కౌంటర్ ఇచ్చారు.
బాబాయ్‌కి ఎన్నిపోట్లు పొడిచారు..?
మంత్రులు చేసిన వ్యాఖ్యలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్ లో ప్రస్తావించారు. మరి దివంగత నేతని అంబానీ చంపించారు, అని ఆస్తులు ధ్వంసం చేసి చివరికి అతని మనిషికే రాజ్యసభ్య సీటు ఇప్పించిన మీరు ఎవరికి ( వై.ఎస్ ) వెన్నుపోటు పొడిచినట్లు వైఎస్ జగన్ ? అంటూ .. తీవ్ర విమర్శలు చేశారు. ముందర గుండె పోటు అని తరువాత గొడ్డలి పోటు అన్నారు. మరి బాబాయ్ కి ఎన్నిపోట్లు పొడిచారు..? అని ప్రశ్నించారు.
"ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ ఆ ఆంధ్ర"
అంతటితో అగని గోరంట్ల.. ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గింపుపైనా సెటైర్లు విసురుతూ మరో ట్వీట్ చేశారు. బాటిల్ రేటు తగ్గింది.. అంటే అమ్మకాలు పెరుతాయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారూ..? ప్రశ్నించారు. అంటే మొన్నామధ్య రేటు పెరిగితే తాగడం మానేస్తారు అన్నారు ఒకరు "ది గ్రేట్ బ్లఫ్ మాస్టర్ ఆ ఆంధ్ర" అంటూ తనదైన శైలిలో ఫంచ్లు విసిరారు.
"ఫిష్" ఆంధ్ర "మటన్" ఆంధ్ర
అటు ఒరిస్సాలో స్టార్ట్ అప్స్ కోసం O - Hub పెట్టారు .. తెలంగాణలో T-Hub పెట్టారు.. ఏపీలో మాత్రం "ఫిష్" ఆంధ్ర "మటన్" ఆంధ్ర పాయింట్లు పెడుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. జగన్ పై గోరంట్ల చేసిన ట్విట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది . మరి వైసీపీ నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications