దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు: సోము వీర్రాజుకు బుచ్చయ్య సవాల్
రాజమండ్రి: బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తనపై పోటీ చేసి విజయం సాధించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడ సోము వీర్రాజు విజయం సాధించడని ఆయన అభిప్రాయపడ్డారు.
బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇటీవల కాలంలో టిడిపిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో టిడిపి నేతలు కూడ బిజెపి నేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెబుతున్నారు.

ఆదివారం నాడు రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సభ కోసం సోము వీర్రాజు బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆయన ఆరోపించారు.
పట్టిసీమపై సోము వీర్రాజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. కర్ణాటక రాష్ట్రంలోని తెలుగు ప్రజలు బిజెపిని ఓడించనున్నారని ఆయన జోస్యం చెప్పారు.
మోడీ, అమిత్‌షాలు నియంతలా వ్యవహరిస్తున్నారని బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీకి ఇచ్చిన హమీలను బిజెపి అమలు చేయలేదని చెప్పారు. ఈ కారణంతోనే ఎన్డీఏ నుండి తాము బయటకు వచ్చామని ఆయన చెప్పారు.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications