రుణమాఫీ పూర్తిగా అమలుకాలేదు:టిడిపి ఎమ్మెల్యే మోదుగుల సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

గుంటూరు: టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుకు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల హెక్టార్ల ఎకరాల్లో లే అవుట్లు వేసి రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tdp Mla Modugula Venugopal Reddy sensational comments on governament

నకిలీ విత్తనాలకు గుంటూరు జిల్లా అడ్డాగా మారిందని ఆయన విమర్శించారు. ఎరువుల మిక్సింగ్ ప్లాంట్లలో కల్తీ జరుగుతోందన్నారు. ప్రచారం కోసమే సోదాలు చేస్తున్నట్టుగా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు.

పార్టీ పరువును బజారునపడేలా వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నాయకులకు ఆదేశాలు జారీచేసిన కొద్దిగంటల్లోనే మోదుగుల ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp Mla Modugula Venugopal Reddy sensational comments on governament on Thursday. realtors got subisidy in the name of farmers he said.
Please Wait while comments are loading...