రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు ..వారి సొంత ప్రయోజనాలకే బడ్జెట్ : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
ఏపీని వైసిపి నాశనం చేస్తోందని మండిపడుతున్నారు టిడిపి నేతలు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. నేడు ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన తెలియజేయాలని భావిస్తున్న టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. టిడిపి నేతల అరెస్టులకు తాము నిరసన తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లు కక్షసాధింపు చర్య
టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లు కక్షసాధింపు చర్య అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పారాసిటమాల్ చాలు అంటూ కరోనాను తేలిగ్గా తీసుకున్నారని నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. పేదలను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఒకపక్క మద్యపాన నిషేధం చేస్తున్నామని చెబుతూనే, ఏపీలో కొత్త బ్రాండ్ లను జె టాక్స్ కోసం దింపారని ఆయన విమర్శించారు.

వారి సొంత ప్రయోజనాల కోసమే బడ్జెట్
లాక్ డౌన్ తో మద్యానికి దూరంగా ఉన్న ప్రజలకు మళ్లీ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చి పేదల జీవితాల్లో చిచ్చు పెట్టారని విమర్శించారు. ఇళ్ల స్థలాల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని రామానాయుడు మండిపడ్డారు. ఇసుక మాఫియా రెచ్చిపోతుంది అని ఇసుక దొరకకుండా చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వైసీపీ మంత్రులు వారి సొంత ప్రయోజనాల కోసం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారని, దాని ఆమోదం కోసం హడావిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
Recommended Video

అసెంబ్లీ వేదికగా నిరసనలు
ప్రభుత్వ వైఫల్యాలను టిడిపి నేతలు అసెంబ్లీలో నిలదీయనున్నారని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ నేడు అసెంబ్లీలో నిరసన తెలియజేయాలన్న వ్యూహంతో టిడిపి,అందించిన సంక్షేమ పథకాలను తెలియజేసి, బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవాలని వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం తాజా రాజకీయ పరిణామాలతో అధికార వైసీపీ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications