ఆ ప్రశ్నతో చంద్రబాబుకే షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే-ప్రతిగా సవాల్ విసిరిన సీఎం..!
ఏపీలో ఇవాళ జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల భేటీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సహజంగా రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన సీఎం చంద్రబాబు ఏదైనా విషయంపై ప్రసంగిస్తున్నా, లేక సూచనలు చేస్తున్నా పార్టీ ఎమ్మెల్యేలు,లేదా ఇతర ప్రజాప్రతినిధులు ఎదురుచెప్పేందుకు సాహసించరు. కానీ ఇవాళ ఓ తొలిసారి ఎమ్మెల్యే మాత్రం చంద్రబాబు చెప్పిన ఓ విషయంతో విభేదిస్తూ ఆయనకే ప్రశ్నలు వేశారు. దీంతో సీఎం షాకయ్యారు.
అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశమయ్యారు. తాజా పరిస్ధితులపై వారితో చర్చించారు. అలాగే వారికి దిశానిర్దేశం కూడా చేశారు.
ప్రతి నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలను కోరారు. వేరే రాష్ట్రాల్లో టూరిజం లేకపోయినా అభివృద్ధి చెందుతున్నాయని, మన రాష్ట్రంలో టూరిజం కి మంచి అవకాశం ఉందన్నారు.

అలాగే ఉచిత ఇసుక విధానం సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించారు. అదే సమయంలో ఇసుక, మద్యం జోలికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించారు. దీంతో రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం సరిగా లేదంటూ సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. ముందు అసలు ఇసుక విధానం చదివావా అంటూ ప్రశ్నించారు. ఇసుక విధానం సమగ్రంగా చదివి ఎవరి పరిధిలో వారు సక్రమంగా అమలు చేయాల్సిందేనని చంద్రబాబు సూచించారు. ఇసుక విధానం లో సమస్య ఎక్కడుందో చెప్తే ఇప్పుడే పరిష్కారం చెప్తానంటూ ఎమ్మెల్యేలకు సీఎం సవాల్ విసిరారు.













Click it and Unblock the Notifications