నిన్న తిరుమల లడ్డూ, నేడు సింహాచలం, జగన్ ఏం ఉద్దరించాడు ?,గంటా

నేను చాలా ఆదా చేస్తానని, పైసా ఖర్చు పెట్టనని, ఆంధ్రప్రదేశ్ ను ఉద్ధరించడానికి నేను అధికారంలోకి వచ్చానని, నా అంత మంచివాడు ఎవ్వరూ లేరనే మంచి పేరు తెచ్చుకోవాలని అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ అమలు చేసిన రివర్స్ టెండరింగ్ వల్ల అనేక అనర్థాలు జరిగాయని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.

శనివారం సింహాచలం ఆలయంలో ముడి సరుకులను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా నెయ్యి రుచి చూసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సింహాచలం ప్రసాదం లడ్డు తయారు చేసే నెయ్యిలో రుచి, వాసన రెండూ లేకపోవడం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం గంటా శ్రీనివాసరావు అక్కడ భక్తులతో మాట్లాడి స్వామివారి ప్రసాదాల నాణ్యతపై భక్తుల అభిప్రాయం తెలుసుకున్నారు.

TDP MLA who was surprised after tasting Prasadam and ghee in Simhachalam temple

అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా కిలో నెయ్యి రూ. 591 నుంచి రూ. 391 తగ్గిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ ఎక్కడా నెయ్యి దొరకనట్లు ఉత్తరప్రదేశ్ నుండి రూ. 391 రూపాయలకే కేజీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటే ఆనెయ్యి నాణ్యమైనది, రుచికరమైనది అని ఎలా నమ్మగలం అని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీ నాయకులు ప్రశ్నించారు.

తిరుమల లడ్డూల తయారిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటివి వాడారని ల్యాబ్ నివేదికలో వెలుగు చూడడంతో కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి ఏ శిక్ష విధించాలో అనే విషయం స్వామివారి భక్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించాలని, ఆ నిర్ణయం ప్రజలరకే వదిలేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఇంత జరిగినా కూడా వైసీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వం మీద ఎదురు దాడి చేస్తున్నారని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల కూడా వీటిని పరిశీలిస్తున్నారని, ఏ స్థాయి వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉంది అన్నది ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

ప్రసాదాలు నాణ్యంగా ఉండేటట్లు, దేవాలయాలకు పూర్వం వైభవం తీసుకొచ్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గంటా శ్రీనివాసరావు అన్నారు. దేవాలయాల్లో నాణ్యమైన ప్రసాదాల వ్యవస్థను భక్తులకు అందించడానికి, వాటిని చక్కదిద్దడానికి చంద్రబాబు నేతత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+