''రోజాది చింతామణి క్యారెక్టర్, ఆల్కహల్ టెస్ట్ చేయాలి'', ''బాబు చెంచాలకు ఉలికిపాటు''

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నంద్యాల ఉప ఎన్నికను పురస్కరించుకొని అధికార టిడిపి, విపక్ష వైసీపీల మధ్య మాటల యుద్దం సాగుతోంది..రెండు పార్టీల నేతలు ఒకరు వ్యక్తిగత విమర్శలకు సైతం కూడ వెనుకాడడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దావెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. రోజా డ్రామా కంపెనీలో చింతామణి క్యారెక్టర్ అంటూ వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఈ నెల 23వ, తేదిన జరిగే ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను రెండు పార్టీల నేతలు వ్యూహలను రచిస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు నంద్యాలలోనే మకాం వేసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

అధికార పార్టీకి తరపున ఎనిమిది మంది మంత్రులు నంద్యాల ఉప ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపిలు నంంద్యాలలో మకాం వేశారు.

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల నేతలు చేస్తున్న విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విమర్శలు గుప్పించారు. మరోవైపు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి టిడిపి నేతలపై ఆరోపణలను గుప్పించారు.

 రోజాది చింతామణి క్యారెక్టర్

రోజాది చింతామణి క్యారెక్టర్

వైసీపీ డ్రామా కంపెనీలా మారిందని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. అయితే వైసీపీ డ్రామా కంపెనీలో రోజా చింతామణి క్యారెక్టర్ అని వివాదార్సపద వ్యాఖ్యలు చేశారు. అఖిలప్రియ డ్రెస్ గురించి రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది. సభల్లో పాల్గొనే సమయంలో రోజాకు ఆల్కహల్ టెస్ట్ పరీక్షలు నిర్వహించాలని కోరారు.

Daggubati Purandeswari Will Join In YSRCP Before 2019 Elections - Oneindia Telugu
రోజా ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారు

రోజా ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారు


చెల్లని చెక్కుల కేసుల్లో రోజా ఎన్నోసార్లు కోర్టు మెట్లు ఎక్కారన్నారు. అలాంటి వ్యక్తి టిడిపి నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు..చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల కారణంగా టిడిపికి లక్ష మెజారిటీ పెరిగినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. వైసీపీ నేతలు టిడిపి నేతలపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు బేద్దా వెంకన్న.

ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుది

ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుది

ఏపీ సీఎం చంద్రబాబు అరాచకపాలన కొనసాగిస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చెప్పారు. స్వంత మామ ఎన్‌టిఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ప్రజలను వంచించడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన విమర్శలు గుప్పించారు.నంద్యాలలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నారు.

హమీలను అమలు చేయాలని

హమీలను అమలు చేయాలని


ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయాలని చంద్రబాబును నిలదీస్తే చంద్రబాబు చెంచాలకు ఉలికిపాటు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు ప్రజా
సమస్యలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp MLC Buddha Venkanna controversy comments on Ysrcp MLA Roja on Tuesday. Yscrp leader Nallapreddy prasannakumar reddy slams on Tdp chief Chandrababu.
Please Wait while comments are loading...