ఏపీలో పదో తరగతి పరీక్షల రద్దు- జగన్ సర్కార్‌కు లోకేష్‌ డెడ్‌లైన్‌

ఏపీలో కోవిడ్ కేసుల కల్లోలం కొనసాగుతోది. రోజుకు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. దాదాపు ప్రతీ జిల్లాల్లో కరోనా వ్యాప్తి విచ్చలవిడిగా కొనసాగుతోంది. అయినా ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షలకే మొగ్గుచూపుతోంది. దీనిపై ఇప్పటికే విపక్షాలన్నీ ముక్తకంఠంతో పోరాడుతున్నా ప్రభుత్వం మాత్రం విద్యార్ధుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతోంది.

ఏపీలో కరోనా కల్లోలం నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కి తీసుకునేందుకు ఆయన 48 గంటల గడువు విధించారు. అప్పటికీ స్పందించకపోతే పిల్లల ప్రాణాలే రక్షణగా అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని లోకేష్‌ ప్రకటించారు. కోటి మంది ప్రాణాలు పణంగా పెట్టి పరీక్షలు పెడతారా మూర్ఖపురెడ్డీ అంటూ లోకేష్‌ ప్రశ్నించారు.

tdp mlc nara lokesh put 48 hour deadline to cm jagan for cancellation of 10th exams

దేశమంతా పరీక్షలు రద్దు చేస్తే ఏపీలో పరీక్షలు పెట్టడం జగన్ రెడ్డి మూర్ఘత్వమేనని నారా లోకేష్ విమర్శించారు. పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రద్దు చేయాలని, ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు మాత్రం వాయిదా వేయాలన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో ప్రస్తుత పరిస్ధితులు, పరీక్షల నిర్వహణతో ఎదురయ్యే పరిస్ధితులపై లోకేష్‌ జూమ్‌లో విద్యార్ది సంఘ నేతలు, న్యాయనిపుణులు, విద్యావేత్తలతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. సెకండ్‌ వేవ్‌ బాధితుల్లో చిన్నారులు, విద్యార్ధులు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+