టీడిపి ఎంపీ అభ్యర్థులు వీరే..! మరో రెండు మూడు రోజుల్లో అదికారికంగా ప్రకటించనున్న బాబు..!!
అమరావతి/ హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయడంతో పాటు అభ్యర్థులు ఎంపికలో వేగం పెంచింది. శాసనసభ అభ్యర్ధుల ఎంపికను అదికార తెలుగుదేశం పార్టీ దాదాపు ఖరారు చేసింది.అధికారికంగా ప్రకటించకపోయినా తెలుగుదేశం లోక్ సభ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు చేసింది టీడిపి. ఇందులో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు సైతం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఎంపీ అభ్యర్థుల్లో సగం మంది మారిపోవడం విశేషం.
గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో సగం మంది తమ సీటు ఖాళీ చేస్తుండగా, అక్కడ తెలుగుదేశం తరఫున కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. ముగ్గురు మాత్రం స్వతంత్రంగా పోటీ నుంచి తప్పుకున్నారు. వారిలో కాకినాడ ఎంపీ తోట నర్సింహం, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోటీలో లేరు. ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు పార్టీలు మారిపోయారు. నరసరావు పేట, బాపట్ల పెండింగ్‌లో ఉన్నాయి. బాపట్ల అభ్యర్థి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక స్థానాల వారిగా అభ్యర్థులు ఎవరో చూద్దాం:- 1.శ్రీకాకుళం - కె.రామ్మోహన్ నాయుడు (పాత). 2.విజయనగరం - పి.అశోకగజపతి రాజు (పాత). 3.విశాఖపట్నం - శ్రీభరత్ (కొత్త).4.అనకాపల్లి - అడారి ఆనంద్ (కొత్త). 5.అరకు - వి కిషోర్ చంద్రదేవ్ (కొత్త). 6.కాకినాడ- చలమలశెట్టి సునీల్ (కొత్త). 7.అమలాపురం - జి.హరీష్ మాథుర్ (కొత్త). 8.ఏలూరు - మాగంటి వెంకటేశ్వరరావు (పాత). 9.మచిలీపట్నం - కొనకళ్ల నారాయణ (పాత). 10. విజయవాడ - కేశినేని నాని (పాత). 11.గుంటూరు - గల్లా జయదేవ్ (పాత). 12.బాపట్ల - డొక్కా మాణిక్యం (కొత్త). 13.ఒంగోలు - ఎంఎం కొండయ్య (కొత్త). 14.కర్నూలు - కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (కొత్త). 15.అనంతపురం - జేసీ పవన్ కుమార్ రెడ్డి (కొత్త). 16.హిందూపురం - నిమ్మల కిష్టప్ప (పాత). మరి కొన్ని నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారుచేసే పనిలో ఉన్నారు. బుధవారం లోపు అవి కూడా పూర్తవుతాయని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. .












Click it and Unblock the Notifications