• search

మోడీకి బలముందని అందరికీ తెలుసు: గల్లా జయదేవ్, కౌంటర్‌కు కేంద్రం సిద్ధం

By Srinivas
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంతో కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశ్యం తమకు లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ శుక్రవారం అన్నారు. దీని ద్వారా ఏపీ సమస్యలను జాతీయస్థాయికి తీసుకు వెళ్లడమే తమ ఉద్దేశ్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సభ ఎదు రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికి ఇది మంచి అవకాశమన్నారు.

  చదవండి: బాబు వ్యూహమే: కేశినేని, టీడీపీకి టీఆర్ఎస్ షాక్.. ఎవరిని అడిగి అవిశ్వాసం పెట్టారు

  విభజన సమస్యలు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తదితర అంశాలపై నరేంద్ర మోడీ స్పందించేలా చేస్తామని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు సాధించుకోవడం ఏపీ హక్కు అన్నారు. అందులో బేరసారాలేమీ ఉండవని చెప్పారు. బీజేపీకి సంఖ్యాబలం ఉందని అందరికీ తెలిసిందేనని చెప్పారు.

  TDP MP Galla Jayadev on No confidence motion, Govts backroom preparations to blunt oppn offensive

  కేంద్రంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి తమ మద్దతు ఉంటుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. లోకసభలో తమకు ఎంపీలు లేకపోయినప్పటికీ బయటి నుంచి మద్దతు ఉంటుందని చెప్పారు.

  చదవండి: దెబ్బకు 4 పిట్టలా, సెల్ఫ్ గోలా? పవన్ ఆయుధంతో ఆయనే టార్గెట్, జగన్‌కు ఛాన్స్ మిస్

  2014లో తమ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత వేరే పార్టీలో చేరిన నలుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరుతామని చెప్పారు. కాగా, విభజన హామీలు నెరవేర్చాలంటూ వైసీపీ మాజీ ఎంపీలు పార్లమెంటు ఎదుట నిరసన తెలిపారు.

  ఇదిలా ఉండగా, అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కేంద్రం అన్ని అస్త్రాలతో సిద్ధమయింది. ఏపీకి ఇచ్చిన జాబితాపై అన్ని రకాల వివరాలు, పూర్తి సమాచారం ఇవ్వాలని ఆయా కేంద్రమంత్రులు తమ తమ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సమాచారం సిద్ధం చేసుకుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ahead of the debate on no confidence motion in the Lok Sabha, all central ministries and departments have been directed to prepare a list of achievements of the Narendra Modi government which will be highlighted on Friday while a core team will be at work to counter the opposition's offensive as the debate progresses, officials said on Thursday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more