పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన ఎంపీ బాబుకు షాక్: కేసీఆర్ మంచోడన్న మల్లారెడ్డి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు మల్లా రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి అని ఆయన శుక్రవారం నాడు కితాబిచ్చారు.

మల్కాజిగిరి నియోజకవర్గంలో పేదలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ మంచి ముఖ్యమంత్రి అన్నారు.

TDP MP praises CM KCR

కష్టపడే, న్యాయమైన ముఖ్యమంత్రి అని చెప్పారు. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రికి అందరు సహకరించాలని కోరారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో మల్లారెడ్డికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సత్తా చీఫ్ జయప్రకాశ్ నారాయణ కూడా పోటీ చేశారు. అయితే, పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ మల్లారెడ్డికి మద్దతు పలికారు. కాగా, పలువురు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారు. ఇప్పుడు మల్లారెడ్డి ముఖ్యమంత్రిని పొగడటంతో అనుమానాలకు తావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+