వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీగా పోటీ చేయ‌లేను : సీయంతో మాగుంట చెప్పిన కార‌ణ‌మేంటి : టిడిపి ఎంపీల‌కు ఏమైంది..!

|
Google Oneindia TeluguNews

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. అభ్య‌ర్ధుల ఎంపిక ప్ర‌క్రియ అధికార టిడిపిలో వేగంగా సాగుతోంది. అయితే, అసెంబ్లీ పైనే ఎక్కువ పోటీ క‌నిపిస్తోంది. ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ లు సైతం వెనుకాడుతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రు టిడిపి సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి వైసిపి లో చేరారు. మ‌రో ఇద్ద‌రు పోటీ చేయ‌లేమ‌ని తేల్చి చెప్పారు. ఇక‌, తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం కొత్త కార‌ణంతో పోటీకి దూరంగా ఉంటున్నారు..ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది..

<strong>అనిత కు సీటు లేన‌ట్లేనా : అమ‌రావ‌తిలో అస‌మ్మ‌తి గ‌ళం : బాబు కీల‌క నిర్ణ‌యం..!</strong>అనిత కు సీటు లేన‌ట్లేనా : అమ‌రావ‌తిలో అస‌మ్మ‌తి గ‌ళం : బాబు కీల‌క నిర్ణ‌యం..!

ఎంపీలుగా పోటీకి అనాస‌క్తి..

ఎంపీలుగా పోటీకి అనాస‌క్తి..

టిడిపి నుండి పోటీ చేసేందుకు సిట్టింగ్ లు ఆస‌క్తి చూప‌టం లేదు. అన‌కాప‌ల్లి, అమ‌లాపురం ఎంపీలు ఏకంగా పార్టీని వీడి వైసిపి లో చేరారు. వారిద్ద‌రూ వైసిపి నుండి ఎమ్మెల్యేలు గానే బరిలోకి దిగుతున్నారు. ఇక, కాకినాడ ఎంపిగా వ్య‌వ హ‌రించిన తోట న‌ర్సింహం సైతం తాను పోటీ చేయ‌లేన‌ని చెప్పారు. రాజ‌మండ్రి ఎంపి మాగంటి ముర‌ళీ మోహ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌టం లేద‌ని అధినేత‌కు తేల్చి చెప్పారు. దీంతో..అక్క‌డ బ‌ల‌మైన ఎంపీ అభ్య‌ర్దుల కోసం టిడిపి అధినాయ‌క‌త్వం అన్వేష‌ణ ప్రారంభించింది. హోరా హోరీ పోరులో కొత్త వారికి అవ‌కాశం ఇస్తే ఏ ర‌క‌మై న ప్ర‌భావం ప‌డుతుందో అనే ఆలోచ‌న టిడిపిని వెంటాడుతోంది. దీంతో..ఎంపీ అభ్య‌ర్దుల ఎంపిక టిడిపికి ఇప్పుడు స‌వాల్ గా మారుతోంది.

తాజాగా మాగుంట చెప్పిన కార‌ణం

తాజాగా మాగుంట చెప్పిన కార‌ణం

ఇక‌, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ నుండి టిడిపి లో చేరిన మాగుంట ఒంగోలు నుండి ఎంపీ అభ్య‌ర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఇప్పుడు పోటీ కోసం చంద్ర‌బాబు ఒంగోలు స్థానం నండి మాగుంట ను బ‌రిలోకి దింపాల‌ని టిడిపి అధినేత చంద్రబాబు నిర్ణ‌యించారు. అయితే, తాను ఎంపీగా పోటీ చేయ‌లేన‌ని మాగుంట నేరుగా చంద్ర‌బాబు తో చె ప్పారు. అయితే, మాగుంట వైసిపి లో చేరుతార‌ని..ఆ త‌రువాత జ‌న‌సేన అధినేత తో సమావేశం కావ‌టంతో జ‌న‌సేన లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, మాగుటం తో భేటీ త‌రువాత చంద్ర‌బాబు ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేసారు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల దాడుల కార‌ణంగా త‌మ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని..పోటీకి దిగ‌టానికి ఆర‌వ‌టం లేద‌ని చెప్పారు. దీంతో..మాగుంట పై కొద్ది కాలం క్రితం చెన్నై లో ఐటి దాడులు జ‌రిగాయి. దీని కార‌ణంగా నే ఆయ‌న టిడిపి నుండి పోటీ చేయ‌టానికి ఆస‌క్తి చూప‌టం లేద‌నే భావ‌న చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల్లో స్ప‌ష్ట‌మైంద‌ని భావిస్తున్నారు.

ఎంపీ అభ్య‌ర్దుల కోసం అన్వేష‌ణ‌..

ఎంపీ అభ్య‌ర్దుల కోసం అన్వేష‌ణ‌..

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 25 సీట్లు గెలిచి..కేంద్రంలో ప్ర‌ధాని ఎవ‌రు అవ్వాలో తామే నిర్ణ‌యిస్తామ‌ని టిడిపి అధినేత చెబుతూ వ‌చ్చారు. కానీ, ఇప్పుడు పోటీకి అభ్య‌ర్ధుల‌నే అన్వేషించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కాగా ఇప్పటికే అధికార పార్టీ పలు జిల్లాల్లో పార్లమెంట్‌ అభ్యర్థుల కోసం భూతద్దంతో అన్వేషణ సాగిస్తోంది. ముఖ్యంగా నెల రోజులుగా అభ్యర్థి కోసం కసరత్తు చేస్తున్నా.. పార్టీ అధిష్టానం ఆశించే స్థాయి నేత దొరక్కపోవడం, ఆయా స్థానాల నుంచి పోటీ చేసేందు కు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. నెల రోజులుగా పార్టీలో వేగంగా సమీకరణాలు మారిన క్రమంలో నేతలు అందరూ అసెంబ్లీకే మొగ్గు చూపడం తో పార్లమెంట్‌కు అభ్యర్థి సమీప దూరాల్లో కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రామాణికం గా తీసుకున్నా ఆయా సామాజిక వర్గంలో నేతలు ముందుకు రాకపోవడంతో పార్టీ ముఖ్యులు తలలు పట్టుకుంటున్నా రు.

English summary
Many TDP sittimng MP''s not willing ot contest again from TDp for up coming elections. Up to now two sitting mp's resigned for tdp and other tow mp's informed party president. Now, senior leader Magunta Srinivasa Reddy also in same route to not contest as MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X