వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథ కంచికి... టీడీపీ సారు ఇంటికి..?

|
Google Oneindia TeluguNews

య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెలుగుదేశం పార్టీలో సీనియ‌ర్ నేత‌గా దశాబ్దాల తరబడి కొనసాగుతున్నారు. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని నుంచి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించేవారు. 2014, 2019 వరుస ఎన్నికల్లో అక్కడి నుంచి ఆయన తమ్ముడు కృష్ణుడు ఓటమిపాలవడంతో అధిష్టానం సీటిచ్చే విషయంలో పునరాలోచన చేస్తోంది. ఆయనపై వరుస ఎన్నికల్లో గెలుపొందిన దాడిశెట్టి రాజా మంత్రిగా కొనసాగుతున్నారు.

దాడిశెట్టిని ఓడించాలంటే..

దాడిశెట్టిని ఓడించాలంటే..

మంత్రిగా అధికార బలంతో ఉన్న వ్యక్తిని ఓడించాలంటే కృష్ణుడు సరిపోడని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాకుండా వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి సీటిచ్చేది లేదని మహానాడులోనే ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో యనమల తన కుమార్తె దివ్యకు కాకినాడ రూరల్ లో పోటీచేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే కృష్ణుడికి ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని కేటాయించాలని అధిష్టానంతో మాట్లాడారు. అయితే అటువైపు నుంచి పాజిటివ్ గా స్పందన రాలేదని సమాచారం.

టీడీపీకి తెల్ల ఏనుగుల్లా మారిన సీనియర్లు?

టీడీపీకి తెల్ల ఏనుగుల్లా మారిన సీనియర్లు?


సీనియర్ నేతలు టీడీపీకి తెల్ల ఏనుగుల్లా మారారని పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ భావిస్తున్నారు. వరుస ఎన్నికల్లో ఓటమిపాలైనవారిపట్ల ప్రజల నుంచి కూడా సరైన స్పందన వ్యక్తం కాదనే భావనతో యనమల ప్రతిపాదనను నిరాకరించినట్లు తెలుస్తోంది. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు ప్రారంభమవడానికి కూడా యనమలే కారణమనే యోచనతో అధిష్టానం ఉంది. ఈ విభేదాలు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయని, రానున్న ఎన్నికలకు యనమల కుటుంబాన్ని దూరంగా ఉంచడమే పార్టీకి శ్రేయస్కరమని భావిస్తున్నారు.

నిమ్మకాయల చినరాజప్ప చెప్పడంతో..

నిమ్మకాయల చినరాజప్ప చెప్పడంతో..


జిల్లాలో టీడీపీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న నమ్మకాయల చినరాజప్ప కూడా యనమలపై అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. యనమల వైఖరితో జిల్లాలో పార్టీకి తీవ్ర చేటు కలుగుతోందని, వెంటనే జోక్యంచేసుకొని నివారించాలని సూచించారు. పార్టీలో బీసీ వర్గానికి చెందిన నేతలు కూడా భారీసంఖ్యలో ఉన్నారని, ఆ కోణంలో కూడా యనమల నుంచి పార్టీకి ఒనగూరే ప్రయోజనం ఏదీలేదనే భావనతో అధిష్టానం ఉంది. తునిలో పార్టీ అధిష్టానం దృష్టిలో ఒకరున్నారని, కానీ ఇప్పుడే ప్రకటించరని పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు నాయుడు యనమల పట్ల సానుకూల వైఖరితో ఉన్నప్పటికీ నారా లోకేష్ మాత్రం అందుకు వ్యతిరేక వైఖరితో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో దాడిశెట్టి రాజా బలమైన అభ్యర్థి అవుతారని పలు సర్వేలు తెలియజేయడంతో ఆయనకు ధీటైన అభ్యర్థిని నిర్ణయించినప్పటికీ పేరును ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. అప్పటివరకు వేచిచూడక తప్పదు.

English summary
TDP leader in Mahanadu Nara Lokesh has announced that those who have lost three times in a row will not have a seat in the next elections. Party circles revealed that this announcement also applies to Yanamala Ramakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X