టార్గెట్ జగన్: 2019 ఎన్నికలకు బాబు ప్లాన్, వైసీపీకి అగ్నిపరీక్షే

Recommended Video

    Lagadapati Rajagopal latest survey facts on TDPలగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు | Oneindia Telugu

    ర్నూల్: కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం కోసం టిడిపి నాయకత్వం కసరత్తు చేస్తోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపుతో ఉన్న టిడిపి నాయకత్వం కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ వ్యూహలను రచిస్తోంది.

    రాయలసీమలో వైసీపీని దెబ్బతీసేందుకు ఇదే మంచి సమయమని టిడిపి నాయకత్వం భావిస్తోంది. నంద్యాల ఉపఎన్నికల్లో బారీ మెజారిటీతో విజయం సాధించిన టిడిపి అదే ఊపుతో వైసీపీని మరింత దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

    వైసీపీపై మైండ్‌గేమ్‌ను ప్రారంభించింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపికి చెందిన కీలక నేతలు ప్రకటించారు.

    వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో కూడ తాము పై చేయి సాధించామనే విశ్వాసాన్ని కల్గిస్తే 2019 ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయం టిడిపి నేతల్లో ఉంది.

    టార్గెట్ కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలు

    టార్గెట్ కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలు

    కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికలపై టిడిపి కసరత్తు చేస్తోంది. కార్పోరేషన్‌ను గెలుచుకోనేందుకు టిడిపి వ్యూహరచన చేస్తోంది. 23 ఏళ్ళ తర్వాత కార్పోరేషన్‌ను దక్కించుకొనేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బతీయాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. వరుస విజయాలతో ఊపులో ఉన్న టిడిపి కర్నూల్ కార్పోరేషన్లో టిడిపి జెండా ఎగురవేసేందుకు నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టిడిపి కర్నూల్ కార్పోరేషన్‌ను కైవసం చేసుకొంది. ఆ తర్వాత ఈ కార్పోరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ఈ కార్పోరేషన్‌ను కైవసం చేసుకొంది.

    కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి

    కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి

    1999, 2005లో జరిగిన ఎన్నికలలో కార్పొరేషన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంది. అంత ఘనమైన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి జంకుతోంది.. నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అబ్దుల్‌ ఖాదర్‌ ఘోరంగా ఓడిపోవడాన్ని చూసిన అధిష్టానం పెద్దలు షాక్‌కు గురయ్యారు.అయితే కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తోందో లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

    పట్టును నిలుపుకోవాలని వైసీపీ వ్యూహం

    పట్టును నిలుపుకోవాలని వైసీపీ వ్యూహం

    2014 ఎన్నికల్లో కర్నూల్ జిల్లా నుండి వైసీపీ అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు టిడిపిలో ఫిరాయించారు.అయితే వైసీపీని మరింత బలహీనపర్చేందుకు టిడిపి వ్యూహరచన చేస్తోంది. ఇదే సమయంలో టిడిపికి చెక్ పెట్టేందుకు వైసీపీ కూడ ప్లాన్ చేస్తోంది. కర్నూల్ జిల్లాలో తమ పట్టు ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తోంది.కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ వ్యూహన్ని రచిస్తోంది.

    బిజెపితో పొత్తు ఉంటుందా

    బిజెపితో పొత్తు ఉంటుందా

    బిజెపితో పొత్తున్నా నంద్యాల ఉపఎన్నికల్లో బిజెపి నేతలను టిడిపి దూరం పెట్టింది. కానీ, అదే సమయంలో జరిగిన కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపితో కలిసి టిడిపి పోటీ చేసింది. అయితే కర్నూల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కూడ గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నారు. అయితే ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో బిజెపితో కలిసి టిడిపి పోటీచేస్తోందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. రెండు పార్టీలకు చెందిన నేతలు ఈ విషయమై నోరు విప్పడం లేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+