ప్రకాశం 'చిచ్చు': బాబు తీరుపై అసంతృప్తి, టిడిపికి షాకిస్తారా?
ప్రకాశం జిల్లాలో టిడిపి నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈ నెల 4వ, తేదిన తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తేల్చి చెప్పారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో టిడిపి నేతలు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈ నెల 4వ, తేదిన తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తేల్చి చెప్పారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తన అనుచరులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. అద్దంకిలో కరణం బలరాం వైఖరిపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో టిడిపి నేతల వైఖరితో ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. వైసీపీ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు, నాయకుల తీరుతో టిడిపిలో ఉన్న నాయకులకు పొసగడం లేదు. ప్రకాశం జిల్లాలో వైసీపీని దెబ్బతీసేందుకు టిడిపి ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది.
ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలతో , మొదటి నుండి పార్టీలో కొనసాగుతున్నవారికి సయోధ్య కుదరడం లేదు. దీంతో రెండు వర్గాలను సమన్వయం చేసేందుకు నాయకత్వం తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
అద్దంకి నియోజకవర్గంలో రెండు వర్గాలు బాహ బాహీకి దిగుతున్నాయి. పలుమార్లు ఈ విషయమై చంద్రబాబునాయుడు హెచ్చరించినా కూడ ప్రయోజనం లేకుండా పోయింది.అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోకూడదని కరణంకు చెప్పినా ఆయన వినడం లేదని బాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రిని కలవనున్నా కరణం బలరాం
అద్దంకి నియోజకవర్గంలో టిడిపి నేతల మధ్య వివాదాలు రచ్చకెక్కాయి. గొట్టిపాటి రవి, కరణం బలరాం వర్గీయుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ రెండు కుటుంబాల మధ్య దీర్ఘకాలంగా ఫ్యాక్షన్ గొడవలున్నాయి. అయితే ఇద్దరు కూడ ఒకే పార్టీలో చేరడంతో వీరి మద్య విబేధాలు తీవ్రస్థాయికి చేరుకొన్నాయి. అయితే ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలతో కరణం బలరాం రెండు మూడు రోజుల్లో చంద్రబాబునాయుడును కలిసే అవకాశం ఉంది. బాబుతో సమావేశం సందర్భంగా కరణం బలరాం ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనే ఆసక్తి నెలకొంది.
Recommended Video


4న, భవిష్యత్ కార్యాచారణపై నిర్ణయం
ఈ నెల 4వ, తేదిన తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్టు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్పారు. గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే టిడిపిలో చేరడంతో రాంబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయమై ఆయన పలుమార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన పార్టీని వీడే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. వైసీపీ లేదా జనసేనలో ఆయన చేరుతారానే ప్రచారంలో ఉంది.అయితే ఈ ప్రచారానికి ఈ నెల 4వ, తేదితో తెరపడనుంది.

విస్తృతంగా పర్యటిస్తున్న కరణం బలరాం
అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాం విస్తృతంగా పర్యటిస్తున్నారు. సిఎం రిలీఫ్ పండ్ పంపిణీతో పాటు తన అనుచరులు, కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరామర్శలు, ఫంక్షన్‌లకు అటెండ్ అవుతున్నారు కరణం బలరాం. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

దివి శివరాం అసంతృప్తి
కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కూడ పార్టీ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారు. పోతుల రామారావు పార్టీలో చేరడంతో దివి శివరాం వర్గీయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. నామినేటేడ్ పదవి దక్కుతోందని భావించినా శివరాం కు నిరాశే ఎదురైంది. సోమవారం నాడు ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. అన్ని మండలాల్లో కూడ సమావేశాలు నిర్వహించనున్నారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ , ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల మధ్య ప్రచ్చన్న యుద్దం సాగుతోంది.












Click it and Unblock the Notifications