వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పింఛన్ల తొలగింపుపై ధర్మవరంలో టీడీపీ భారీ ర్యాలీ ; పోలీసుల దురుసు ప్రవర్తన, పరిటాల శ్రీరామ్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లను తొలగిస్తున్నారని రగడ కొనసాగుతూనే ఉంది. ఏపీలో అధికారులు ఇష్టారాజ్యంగా పెన్షన్ లను తొలగిస్తున్నారని లబ్ధిదారుల నుండి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెన్షన్ల వార్ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం అర్హులైన వారికి ఇవ్వాల్సిన పెన్షన్ లను తొలగిస్తున్నారని, నిరుపేదలైన, ముసలివారైన అవ్వతాతలను కూడా పెన్షన్ ఇవ్వకుండా తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు ఆందోళనల బాట పడుతున్నారు.

పింఛన్ల తొలగింపుపై ధర్మవరంలో టీడీపీ భారీ ర్యాలీ

పింఛన్ల తొలగింపుపై ధర్మవరంలో టీడీపీ భారీ ర్యాలీ

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న పెన్షన్ల తొలగింపుపై అనంతపురం జిల్లా ధర్మవరం నుండి తెలుగుదేశం పార్టీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో మాజీ మంత్రి పరిటాల సునీత ,పల్లె రఘునాథ్ రెడ్డిలతో పాటు, పరిటాల శ్రీరామ్ ,మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల తొలగింపుపై టిడిపి ఈరోజు నిరసన కార్యక్రమానికి నిన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో టిడిపి నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. మండల కేంద్రం నుండి తరలివచ్చిన నాయకులను అరెస్ట్ చేశారు.

పరిటాల సునీతపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు .. సునీత ఆగ్రహం

పరిటాల సునీతపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు .. సునీత ఆగ్రహం


అనంతపురంలో గాంధీ నగర్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీని చేపట్టిన తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఓ దశలో మాజీ మంత్రి పరిటాల సునీత పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పరిటాల సునీత ఇతర నేతలతో రామగిరి చిన్న గౌస్ వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి సిఐ వార్నింగ్ ఇచ్చారు. ఇక పోలీసుల తీరుపై పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమపై పోలీసులు కావాలని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. ర్యాలీని అడ్డుకున్నప్పటికీ టిడిపి నేతలు ముందుకు కదిలారు. పింఛన్ల తొలగింపుకు వ్యతిరేకంగా ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. నిరుపేద లబ్ధిదారుల పెన్షన్లను తొలగించవద్దని టీడీపీ జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు.

పింఛన్ లను తొలగిస్తుంటే ప్రశ్నించటం తప్పా ?

పింఛన్ లను తొలగిస్తుంటే ప్రశ్నించటం తప్పా ?


బడుగు జీవులకు ఇస్తున్న సామాజిక పెన్షన్లలో భారీగా కోత విధించి జగన్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటుందని అంటున్నారు. ఇక టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అవ్వాతాతల పింఛన్లను తొలగిస్తుంటే దానిని ప్రశ్నించడం తప్పా.? అంటూ నిలదీశారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి ధర్మవరం ఆర్డీఓకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే పోలీసులతో అడ్డుకుంటారా.? అంటూ ప్రశ్నించారు .రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని పరిటాల శ్రీరామ్ నిప్పులు చెరిగారు.

Recommended Video

PM CARES For Children: Free Education,Rs 10 Lakh Fund | Family Pension, Insurance || Oneindia Telugu

వైఎస్ జగన్ పింఛన్ లను తొలగిస్తూ ముసలివారికి అన్యాయం చేస్తున్నారన్న టీడీపీ


అవ్వాతాతలకు అండగా ఉంటానన్న వైఎస్ జగన్ పింఛన్లను తొలగిస్తూ వారికి అన్యాయం చేస్తున్నారు.ముసలి వయసులో ఆసరాగా ఉండే ఆ కాస్త సొమ్ము రాకుంటే వారు బతికేది ఎలా.? అంటూ పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు . ఈ విషయాన్ని తెలియజేయడానికే ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో తాను, పరిటాల సునీత, టీడీపీ నేతలు ఆందోళన చేశామని, వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నామని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు .వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్దరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

English summary
The Telugu Desam Party has held a rally from Dharmavaram in Anantapur district on the removal of pensions in AP. The rally was attended by former minister Paritala Sunita, Palle Raghunath Reddy, Paritala Shriram, former MLA Parthasarathy and others. Police behaved in sumble on Paritala sunitha in order to prevent this rally. Paritala Shriram flagged off on this.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X