ఎంత డబ్బయినా ఇస్తాం: ఆ ఒక్కడి కోసం ట్రై చేసి చేతులు కాల్చుకున్న టీడీపీ
Chandrababu: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. ఏపీ. ఇంకో మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడొచ్చు. లోక్‌సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఫిబ్రవరి/మార్చి నెలల్లో షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ కసరత్తు మొదలు పెట్టింది.
ఈ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గ స్థాయిలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పార్టీ ఇన్‌ఛార్జీలను మార్చుతోంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తోంది. వాళ్లు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాల్లో కొత్త వారికి ప్రాధాన్యతను ఇస్తోంది.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్‌గా మారాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం వ్యూహాలను రూపొందించుకుంటోంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ అండగా పావులు కదుపుతోంది. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఈ పరిస్థితుల మధ్య తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతోంది. తన అనుబంధ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీని బలోపేతం చేస్తోంది. వైఎస్ఆర్సీపీపై దాడికి దిగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయం వెనకా ముందూ ఆలోచన చేయట్లేదు. ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోంది.
అదే క్రమంలో ఎన్నికల ప్రచార సమయంలో డిజిటల్ క్యాంపెయిన్‌ను మరింత పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఓ టీమ్‌ను రూపొందించుకుంది. జిల్లాలు, నియోజకవర్గాలను యూనిట్‌గా తీసుకుని ఈ విభాగాన్ని స్ట్రెంగ్తెనింగ్ చేస్తోంది.

ఐటీడీపీలోనే ప్రత్యేకంగా ఓ వింగ్‌ను క్రియేట్ చేసింది. ఈ డిజిటల్ క్యాంపెయినింగ్ బాధ్యతలను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు అప్పగించాలని నిర్ణయానికి వచ్చింది. ఆయనతో సంప్రదింపులు సైతం మొదలుపెట్టింది. ఎంత డబ్బయినా ఆయనపై ఖర్చు పెట్టడానికి రెడీ అయింది.
ఇక్కడే టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రపోజల్స్‌ను సునీల్ కానుగోలు తిరస్కరించినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా తీరిక లేకుండా గడుపుతున్న నేపథ్యంలో టీడీపీతో కలిసి పని చేయడాన్ని ఆయన నిర్ద్వందంగా తోసిపుచ్చారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నందున పూర్తి సమయాన్ని కాంగ్రెస్‌కు కేటాయించారని అంటున్నారు.
కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల్లో కీలక పాత్రను పోషించారు సునీల్ కానుగోలు. ఆయన సారథ్యంలో డిజిటల్ క్యాంపెయినింగ్ అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. కర్ణాటకలో అధికార బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఆయన రూపొందించిన డిజిటల్ క్యాంపెయిన్ కాన్సెప్టులు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి.
బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా రూపొందించిన కారు-బేకారు అనే క్యాంపెయిన్ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిందని అంటున్నారు. అలాగే- ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగారు సునీల్ కానుగోలు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని డిజిటల్ క్యాంపెయిన్ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని టీడీపీ భావించినప్పటికీ.. అది ఫలించలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications