Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికాలో టీడీపీ నాయకుడి అరెస్ట్?

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన సీనియర్ నాయకుడు కేసీ చేకూరి అరెస్ట్ అయ్యారు. డల్లాస్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ డల్లాస్ లో తెలుగు ఎన్నారై అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్‌ లో ఆయన దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

డల్లాస్ లో నివసిస్తోన్న తెలుగు ప్రజలు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి- కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. రిట్జ్-కార్ల్‌టన్ ప్రాంతంలో మ్యూజికల్ నైట్ ను నిర్వహించారు. స్థానికంగా నివసిస్తోన్న తెలుగు వారు- తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇందులో పాల్గొన్నారు. మ్యూజికల్ నైట్ లో పాటల ఎంపిక విషయంలో నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పాటలను మాత్రమే సెలెక్ట్ చేయాలంటూ నందమూరి అభిమానులు పట్టుబట్టారు. దీనికి పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతిఘటించారు. అదే సమయంలో మద్యం మత్తులో కేసీ చేకూరి పవన్ కల్యాణ్ అభిమానులపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీన్ని పవన్ కల్యాణ్ అభిమానులు ప్రతిఘటించడంతో గొడవ చోటు చేసుకుంది. ఒకరి పోస్టర్లను ఒకరు చింపేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఇటీవలే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2లో పవన్ కల్యాణ్ పాల్గొన్న విషయం కూడా ఇక్కడ ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ వద్ద పవన్ కల్యాణ్ చేతులు కట్టుకుని నిల్చున్నాడంటూ తెలుగుదేశం అభిమానులు ఎద్దేవా చేశారు. గతంలో పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి బాలకృష్ణ- అలగాజనం అని తిట్టినప్పటికీ చివరికి ఆయన కాళ్ల దగ్గరకే వచ్చాడంటూ టీడీపీ సభ్యులు హేళన చేశారు. మ్యూజికల్ నైట్ లో ఏర్పాటు చేసిన చిరంజీవి, పవన్ కల్యాణ్ పోస్టర్లను చింపేశారు.

TDPs NRI leader KC Chekuri reportedly arrest in Dallas after a clash broke out with Pawan Kalyan fans

దీనితో గొడవ మరింత ముదిరింది. ఘర్షణ పడే స్థాయికి చేరుకుంది. సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఈవెంట్ మేనేజర్లపై కేసీ చేకూరి మద్యం మత్తులో గొడవకు దిగడం, వారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం అందింది. దీనితో ఈవెంట్ మేనేజర్లు కార్ల్‌టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో డల్లాస్ పోలీసులు కేసీ చేకూరిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే తానా రంగంలోకి దిగినట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+