'జగన్ పార్టీని భూస్థాపితం చేస్తారు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు పని చేయవు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపిన నేపథ్యంలో టిడిపి నేతలు విమర్శల జడివా కురిపిస్తున్నారు.

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపిన నేపథ్యంలో టిడిపి నేతలు విమర్శల జడివా కురిపిస్తున్నారు.

ఇప్పటి వరకు జగన్, ఆయన పార్టీ నేతలను టార్గెట్ చేసిన టిడిపి నేతలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.

యూపీలో రాహుల్ గాంధీని మట్టి కరిపించాడని, ఇలాగే ఇక్కడ ఏపీలోను ప్రశాంత్ కిషోర్ జగన్ పార్టీని భూస్థాపితం చేస్తారని విమర్శిస్తున్నారు.

TDP says YS Jagan will not win with Prashanth Kishore's strategy

కోడి తెల్లవారి కూస్తే బాగుండుందని, కానీ అర్ధరాత్రే కూస్తే ఎలా ఉంటుందని కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావడానికి జగన్‌కు అంత తొందర ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు.

ముప్పై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్ కలలు కనడం విడ్డూరమని పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్లీనరీలో చంద్రబాబును, టిడిపిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఇక్కడ పని చేయవని టిడిపి ధ్వజమెత్తుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+