వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దిరెడ్డి అవినీతిచిట్టా.. దోపిడీ కింగ్, పుంగనూరు వీరప్పన్; అవినీతి లెక్కలు ఇవే: టీడీపీ ఎటాక్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, అవినీతి రాజ్యమేలుతుందని తెలుగుదేశం పార్టీ పదేపదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఇటీవల జే గ్యాంగ్ అవినీతి భాగోతం అంటూ ఏపీ మంత్రుల అవినీతి చిట్టాను బయటపెడుతున్న తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాలో తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగు పెట్టని అక్రమ దందా లేదని, చెయ్యని అన్యాయం లేదని, దోపిడి దౌర్జన్యాలలో పెద్దిరెడ్డి హ్యాండ్ పెద్దదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.

జగన్ రెడ్డి గ్యాంగ్ లో దోపిడీ, దౌర్జన్యాలలో పెద్దచేయి పెద్దిరెడ్డిది

జగన్ రెడ్డి గ్యాంగ్ లో దోపిడీ, దౌర్జన్యాలలో పెద్దచేయి పెద్దిరెడ్డిది

ట్విట్టర్ వేదికగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి చిట్టా బయటపెట్టిన టీడీపీ పెద్దిరెడ్డి అంటే పెద్ద మనిషి అనుకుంటే పొరబాటే అంటూ వ్యాఖ్యానించింది. జగన్ రెడ్డి గ్యాంగ్ లో దోపిడీ, దౌర్జన్యాలలో పెద్దచేయి ఈయనదేనని పేర్కొంది. పుంగనూరు వీరప్పన్ గా పేరుబడ్డ ఈ పుడింగి అడుగు పెట్టని అక్రమ దందా లేదు. చేయని అన్యాయం లేదు.

దళితులను ఎక్కడికక్కడ అణచేసే ఈయన గారికి కుల అహంకారం ఒక రేంజ్ లో ఉంటుందని పెద్ది రెడ్డి ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. పంచాయతీరాజ్ గనుల శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దోపిడీ కింగ్ అంటూ పోస్ట్ చేసిన టిడిపి 6889 కోట్ల రూపాయిల దోపిడీకి పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

పెద్దిరెడ్డి అవినీతి చిట్టా చెప్పిన టీడీపీ

పెద్దిరెడ్డి అవినీతి చిట్టా చెప్పిన టీడీపీ

రైతులను బెదిరించి లీటర్ 18 రూపాయలకే శివశక్తి డైరీ నుంచి పాలు కొనుగోలు చేసి ఏడు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని టిడిపి ఆరోపించింది. ఇదేవిధంగా మామిడి రైతులను బెదిరించి తన పల్ప్ కంపెనీ కి తక్కువ ధరకు మామిడికాయలను కొనుగోలు చేశారని దీని ద్వారా 190 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని తెలుగుదేశం పార్టీ మండిపడింది.

 పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భూ మాఫియాపై టీడీపీ ఆరోపణలు

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి భూ మాఫియాపై టీడీపీ ఆరోపణలు

ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ మాఫియా గురించి పేర్కొన్న టిడిపి తిరుపతి, మదనపల్లి, తంబళ్లపల్లి , నగరిలో 800 ఎకరాలకు పైగా భూకబ్జాలు చేశారని ఆరోపణలు చేసింది. దీని ద్వారా 810 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని, తిరుపతిలోని హథీరామ్ మఠం లో మూడు ఎకరాలు కబ్జా చేసి తద్వారా 60 కోట్లు సంపాదించారని, చిత్తూరు జిల్లా పుంగనూరు లోని కల్లూరు లో ఎనభై ఎనిమిది ఎకరాలు డికెటి భూములు కబ్జా చేసి తద్వారా 870 కోట్లు సంపాదించారని పేర్కొంది.

తంబళ్లపల్లి లో బినామీలతో 300 ఎకరాలను ఆక్రమణ చేసి, దానిద్వారా 420 కోట్ల రూపాయలు సంపాదించారని, ఇక ఇళ్ల పట్టాలలో అవినీతికి పాల్పడి 85 కోట్లు సంపాదించారని టిడిపి ఆరోపించింది.

ఇసుక, మైనింగ్ మాఫియాలతో అక్రమార్జనలో పెద్దిరెడ్డి

ఇసుక, మైనింగ్ మాఫియాలతో అక్రమార్జనలో పెద్దిరెడ్డి

ఇక ఇసుక మాఫియా ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 262 కోట్లు సంపాదించారని పేర్కొన్న తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి లో 130 కోట్ల రూపాయలు, చిత్తూరులో 70 కోట్ల రూపాయలు, పీలేరులో 62 కోట్ల రూపాయలు ఇసుక మాఫియా ద్వారా వసూలు చేస్తున్నారని ఆరోపించింది.

ఇక మైనింగ్ మాఫియా ద్వారా వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తున్నారని పేర్కొన్న టిడిపి పీలేరు లో 230 ఎకరాలు మైనింగ్ ద్వారా 415 కోట్ల రూపాయలు, మదనపల్లి లో 70 ఎకరాల మైనింగ్ ద్వారా 170 కోట్ల రూపాయలు, తంబళ్లపల్లి లో 192 ఎకరాల మైనింగ్ ద్వారా 52 కోట్ల రూపాయలు, ఫైళ్లు క్లియర్ చేయాలంటే 50% షేర్ ఇవ్వాలని అవినీతి అక్రమాలతో 650 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించింది.

ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా 1800 కోట్ల రూపాయలు.. పెద్దిరెడ్డిపై టీడీపీ ధ్వజం

ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా 1800 కోట్ల రూపాయలు.. పెద్దిరెడ్డిపై టీడీపీ ధ్వజం

ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా మంత్రి 1800 కోట్ల రూపాయలు సంపాదించారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఇక మద్యం మాఫియాలో డిస్టిలరీ ల ద్వారా కొనుగోలు జరిపి 340 కోట్లు అక్రమార్జన చేశారని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ద్వారా 35 కోట్లు ఆర్జించారని టిడిపి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసింది. దోపిడీకి కింగ్ పెద్దిరెడ్డి అంటూ పుంగనూరు వీరప్పన్ అంటూ తెలుగుదేశం పార్టీ వైసిపి మంత్రుల అవినీతి చిట్టా 4ను బయట పెట్టింది.

English summary
Minister Peddireddy Ramachandra Reddy has been attacked by the TDP as looting king, Punganur Veerappan. TDP revealed Peddireddy's corruption log. Peddireddy ramachandra reddy was targeted for embezzling a total of Rs 6,889 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X