హోదాపై కాంగ్రెస్‌కు బీజేపీ మెలిక: గొడవ పెట్టుకోమని టీజీ వ్యాఖ్య, బీజేపీ ప్లాన్

న్యూఢిల్లీ: కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లు పైన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ శుక్రవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు దీని పైన బెట్టు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

పార్లమెంటులో ప్రత్యేక హోదా బిల్లు పాస్ చేయించుకోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద పని ఏమీ కాదన్నారు. జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తామని చెబితే సరిపోతుందని కొత్త పాయింట్ లాగారు. తద్వారా, జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నందునే ప్రత్యేక హోదా బిల్లుపై బీజేపీ వ్యూహంతో ముందుకెళ్తోందని చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ జీఎస్టీకి మద్దతు ఇస్తే ప్రత్యేక హోదా బిల్లు ఒక్క నిమిషంలో అయిపోతుందన్నారు. ప్రత్యేక హోదా బిల్లు పైన కాంగ్రెస్ పార్టీ దొంగాట ఆడవద్దని విజ్ఞప్తి చేశారు. తాము కేవీపీ బిల్లుకు అనుకూలంగానే ఓటు వేస్తామని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ దొంగాట ఆడుతోందని విమర్శించారు. అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో గొడవ పెట్టుకోవడం తమకు అవివేకం అవుతుందని చెప్పారు.

TDP to back KVP's bill on special status: TG Venkatesh

కాగా, హోదా పైన కేంద్రాన్ని నిలదీయకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబడవలసి వస్తుందని, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని టిడిపి ఎంపీలు.. పార్టీ అధినేత చంద్రబాబు ముందు గళం విప్పారని తెలుస్తోంది.

మద్దతిస్తాం: విజయ సాయి రెడ్డి

కేవీపీ రాజ్యసభలో ప్రతిపాదించిన ప్రయివేటు మెంబర్ బిల్లుకు మరింత మద్దతు లభించింది. ఇప్పటికే ఏపీలోని అధికార పార్టీ టీడీపీ, వామపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ప్రకటించాయి. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్నామని చెబుకుంటున్న ఏపీ విపక్షం వైసీపీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది.

ఈ మేరకు రాజ్యసభలో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీ విజయసాయి రెడ్డి శుక్రవారం ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ ప్రతిపాదించిన బిల్లుకు వైసీపీ ఎంపీగా తాను అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు.

మంత్రులు, ఎంపీలకు బీజేపీ విప్

కేవీపీ బిల్లు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసింది. తాజాగా, శుక్రవారం బీజేపీ కూడా విప్ జారీ చేసింది. మంత్రులు, పార్టీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఈ రోజు మొత్తం సభలోనే ఉండాలని ఆదేశించింది. తద్వారా, బీజేపీ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. బిల్లుకు మద్దతు పలుకుతుందా, బిల్లు రాకుండా చూస్తుందా అనేది ఇంకా సస్పెన్స్‌గా కనిపిస్తోంది.

మరోవైపు, ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్‌లు రంగంలోకి దిగారు. ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+