మకాం మార్చండి: అమరావతిలో ఏపీ టీడీపీ కార్యాలయం, ఎక్కడంటే?

అమరావతి: పార్టీ కార్యక్రమాలు, పరిపాలనా సౌలభ్యం కోసం అమరావతిలో ఏపీ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇకపై అమరావతి నుంచే జరగనున్నాయి. పాలనా వ్యవహారాలను ఇప్పటికే ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా పార్టీకి సంబంధించిన రాజకీయ కార్యక్రమాలను సైతం అమరావతి నుంచే చేయబోతున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఒక వైపు ఏపీ కార్యాలయం, మరోవైపు తెలంగాణ కార్యాలయాలకు కేటాయించారు.

లైబ్రరీ బిల్డింగ్‌లో ఐటీ విభాగం, లైబ్రరీ, నాలెడ్జీ సెంటర్, ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ ట్రస్ట్ మినహా మిగతా విభాగాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నారు. ఇకపై లైబ్రరీ బిల్డింగ్ మొత్తం ట్రస్ట్‌కు మిగిలిన భవనాన్ని తెలంగాణ పార్టీ కార్యకలాపాలకు కేటాయించనున్నారు.

TDP to shift offices of NTR Bhavan to Amaravati

ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రమణకు మాత్రమే ఇందులో కార్యాలయం ఉంది. ఏపీ కార్యాలయాన్ని ఏపీకి తరలించిన తర్వాత తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

దీంతో పాటు టీడీపీ ప్రధాన కార్యదర్శులు ఇతర ముఖ్యనేతలకు విభాగాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు నివాస విషయంలో కూడా చంద్రబాబు బంజారాహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 25లోని అద్దె ఇంటిని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. రోడ్‌నెంబర్ 65లోని సొంతఇంటి నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఫాంహౌస్‌లోనే చంద్రబాబు కుటుంబం నివాసం ఉంటుంది.

కాగా టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మంగళగిరి వద్ద ఏర్పాటు చేయాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. రాజధాని అమరావతితోపాటు ఇటు విజయవాడ అటు గుంటూరు నగరాలకు అత్యంత చేరువలో ఉండేవిధంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న యోచనతో ఉన్న అధిష్టానం మంగళగిరి వద్ద హైవే వెంబడి ఉన్న స్థలాన్ని గుర్తించింది.

TDP to shift offices of NTR Bhavan to Amaravati

మంగళగిరి మండలం ఆత్మకూరు పంచాయతీ పరిధిలో మిడ్‌ వ్యాలీసిటీకి ఉత్తరంగా ఉన్న 4 ఎకరాల 71 సెంట్ల వాగు పోరంబోకు భూమిని పార్టీ కార్యాలయం కోసం ఎంపిక చేశారు. ఈ భూమిని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకునేవిధంగా టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారుల వద్ద ప్రతిపాదనలు పెట్టారు.

ఈమేరకు జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం ప్రతిపాదిత స్థలంలో సర్వే నిర్వహించి పక్కాగా స్థలాన్ని లెక్క తేల్చింది. ఏపీఎస్పీ క్యాంపు హద్దు తర్వాత సర్వే నెం.392లో వాగు కింద 10 ఎకరాల 82 సెంట్ల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి.

వాగు ప్రవాహ మార్గమంతా ఆక్రమణల పాలుకాగా 10.82 ఎకరాల్లో చివరకు 71 సెంట్లు మాత్రమే మిగిలింది. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం కోసం గుర్తించిన 4.71 ఎకరాలను సైతం కొందరు రైతులు ఆక్రమించుకుని అనధికార క్రయ విక్రయాలు జరిపారని రెవెన్యూ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+