అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ఎమ్మెల్సీ ఏకగ్రీవం: టీడీపీకి 9, వైసీపీ నుంచి ఒకే ఒక్కడు ఉమ్మారెడ్డి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో స్ధానిక సంస్ధల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెలుగుదేశం ప్రలోభాలకు పాల్పడుతోందని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు ఉదంతం మరువక ముందే, కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైనట్లు సమాచారం.

ప్రకాశం, కర్నూలు జిల్లాలో తగిన బలం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్ధులను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ రెండు చోట్లా ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్సీలే గెలవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

TDP tries to throw cash for votes in ap mlc elections

స్ధానిక సంస్ధల కోటా కింద ఏపీలో 12 ఎమ్మెల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10 చోట్ల ఏకగ్రీవమైంది. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రెండు స్థానాలకు మాత్రమే గట్టి పోటీ ఉండటంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి.

కర్నూలు బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా డి. వెంకటేశ్వరరెడ్డి బరిలో ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లా బరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అట్ల చినవెంకటరెడ్డి పోటీ పడుతున్నారు.

దీంతో ప్రకాశం, కర్నూలు జిల్లాలలో జులై 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా స్ధానిక ప్రజా ప్రతినిధులకు ఎర వేస్తోంది. డబ్బులు ఆశ చూపడం, వినని వారిపై కేసులు పెడతామంటూ బెదిరింపు చర్చలకు పాల్పడుతున్నారని సమాచారం.

ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అనూహ్య రీతిలో ఎన్నికల బరిలోంచి స్వతంత్ర అభ్యర్థులు తప్పుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఓ కొలిక్కి వచ్చాయి. రెండు జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

తెలుగుదేశం పార్టీ 9, వైయస్ఆర్ కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకుంది. జిల్లాల వారీగా ఎమ్మెల్సీ స్థానాలు పరిశీలిస్తే..

గుంటూరు:
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వైయస్ఆర్ కాంగ్రెస్ )
అన్నం సతీష్ ప్రభాకర్ (తెలుగుదేశం)

కృష్ణా
బుద్దా వెంకన్న (తెలుగుదేశం)
రాజేంద్రప్రసాద్ (తెలుగుదేశం)

అనంతపురం
పయ్యావుల కేశవ్ (తెలుగుదేశం)

తూర్పుగోదావరి
రెడ్డి సుబ్రహ్మణ్యం (తెలుగుదేశం)

చిత్తూరు
గాలి ముద్దు కృష్ణమనాయుడు (తెలుగుదేశం)

విశాఖపట్నం
ఎంవీవీఎస్ మూర్తి (తెలుగుదేశం)
పప్పల చలపతిరావు (తెలుగుదేశం)

విజయనగరం
ద్వారపురెడ్డి జగదీష్ (తెలుగుదేశం)

English summary
TDP tries to throw cash for votes in ap mlc elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X