వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆడపడుచులు, అత్తగారి ఉసురు తగిలి.. కోర్టు బోనులో వైఎస్ భారతి : వంగలపూడి అనిత

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం జగన్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారని విమర్శించారు. తనకు అడ్డువస్తే సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడరని దుయ్యబట్టారు. మోసం చేయడంలో ఆయనను మించిన‌ జగత్ కంత్రీ దేశంలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ష‌ర్మిల‌ను మోసం చేసిన అన్న‌..

ష‌ర్మిల‌ను మోసం చేసిన అన్న‌..

రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు అనిత విమర్శించారు. ఆడపడుచులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నను ముఖ్యమంత్రి చేసేందుకు కష్టపడ్డ సొంత చెల్లి షర్మిలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ద్రోహం చేశారని దుయ్యబట్టారు. ప్రాణ రక్షణ కోసం పక్కరాష్ట్రంలో తలదాచుకుంటుందోని విమర్శించారు.

ఏపీలో అడుగుపెట్ట‌లేని పరిస్థితిలో విజ‌య‌మ్మ‌

ఏపీలో అడుగుపెట్ట‌లేని పరిస్థితిలో విజ‌య‌మ్మ‌

..
కనీసం సీఎం జగన్ అనుమతి లేనిదే తల్లి విజయమ్మ ఏపీలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడిందని అనిత ఆరోపించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో న్యాయం చేస్తానని మరో చెల్లి సునీతను దారుణంగా జగన్ మోసం చేశారని విమర్శించారు. జగన్ పట్ల ఆయన భార్య భారతి ఇప్పటికైనా జాగ్రత్త పడాలని కోరారు. ఆమె పరిస్థితి చూస్తోంటే జాలేస్తోందన్నారు.

Recommended Video

Ys Sharmila : ఇంటికొక్క ఉద్యోగం అన్నారు ..ఇప్పుడేమయ్యాయి పాలకుల మాటలు ? | Oneindia Telugu
3భారతికి తోటి ఆడపడుసులు, అత్తగారి ఉసురు

3భారతికి తోటి ఆడపడుసులు, అత్తగారి ఉసురు

వైఎస్ విజయమ్మ, షర్మిల, సునీతలకు పట్టిన గతి భారతికి పట్టకూడదని తాను కోరుకుంటున్నానని అనిత పేర్కొన్నారు. సీఎం జగన్ తన అవినీతి అక్రమాలతో సంపాదించిన ఆస్తులకు భారతిని యజమానురాలుగా చేశారని విమర్శించారు. జగన్ సహధర్మచారిని అయిన కారణంగా ఆమె కోర్టు బోనులో నిలబడే పరిస్థితి వస్తోందని ఆరోపించారు. తోటి ఆడపడుసులు, అత్తగారి ఉసురు భారతికి తగులుతోందని ఫైర్ అయ్యారు. సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాలకు భారతిని బలిచేసున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలతో పాటు .. సొంత కుటుంబంలో ఆడపడుచులకు కూడా రక్షణలేకుండా పోయిందని అనిత విమ‌ర్శ‌లు గుప్పించారు.

English summary
vangalapudi anita on ys bharathi, tdp anita on cm jagan fraud, andhra pradesh politics
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X