వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో కడప స్టీల్ ప్లాంట్ రచ్చ: అప్పుడు గాడిదలు కాశారా? ఘాటుగా గుడివాడ అమర్‌నాథ్!!

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా రెండవ రోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఇక రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తెలుగుదేశం పార్టీ ప్రశ్న ఇచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయ స్వామి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలను సంధించారు.

 కడప స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నించిన టీడీపీ

కడప స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నించిన టీడీపీ

కడప స్టీల్ ప్లాంట్ కు తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో శంకుస్థాపన చేశామని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి మరొక చోట శంకుస్థాపన చేశారని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు శంకుస్థాపన చేసి మూడేళ్లు అవుతున్నా కడప స్టీల్ ప్లాంట్ అని ఎందుకు పూర్తి చేయలేదని టిడిపి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దివాలా తీసిన సంస్థకు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని ఎలా అప్పగిస్తారని సభా వేదికగా నిలదీశారు.

మూడేళ్ళవుతున్నా కడప స్టీల్ ప్లాంట్ కు ఒక్క అడుగూ పడలేదన్న టీడీపీ

మూడేళ్ళవుతున్నా కడప స్టీల్ ప్లాంట్ కు ఒక్క అడుగూ పడలేదన్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి సారించడం లేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న నోరుమెదపడం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం పై విభజన చట్టంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం లేదని టిడిపి సభ్యులు అసహనం వ్యక్తం చేశారు . భూసేకరణ జరిగినా రైతులకు నష్టపరిహారం కూడా అందించడం లేదని, మూడేళ్లు అవుతున్న కడప స్టీల్ ప్లాంట్ కు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని టిడిపి సభ్యులు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఒక కొత్త పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు.

కడప స్టీల్ ప్లాంట్ పై సభలో రచ్చ .. సమాధానమిచ్చిన మంత్రి బుగ్గన

కడప స్టీల్ ప్లాంట్ పై సభలో రచ్చ .. సమాధానమిచ్చిన మంత్రి బుగ్గన


ఇక కడప స్టీల్ ప్లాంట్ పై తెలుగుదేశం పార్టీ ప్రశ్నలతో సభలో రచ్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అడిగిన ప్రశ్నలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానమిస్తూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మండిపడ్డారు. కరోనా వల్ల రెండేళ్లు ఎలాంటి పనులు చేపట్టలేక పోయాము అని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో 250 కోట్లు పెట్టామని 480 ఎకరాలకు 37 కోట్ల పరిహారం ఇచ్చామని పేర్కొన్నారు. చట్టంలో ఏముందో టిడిపి నేతలు చదివారా అంటూ ప్రశ్నించారు.

కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ ప్రశ్నలకు ఘాటుగా స్పందించిన గుడివాడ అమర్నాథ్

కడప స్టీల్ ప్లాంట్ పై టీడీపీ ప్రశ్నలకు ఘాటుగా స్పందించిన గుడివాడ అమర్నాథ్

ఇక కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై స్పందించిన పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు అని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు మీరు గాడిదలు కాశారా అంటూ మంత్రి ప్రశ్నించారు. అసలు కడప స్టీల్ ప్లాంట్ ఆలోచన వైఎస్ రాజశేఖరరెడ్డిది అని ఆయన తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని, టిడిపి నేతలు తలకిందులుగా తపస్సు చేసినా ఆపలేరని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునేందుకు టీడీపీ యత్నాలు చేస్తోందని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు .బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ లేఖ రాశారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పరిశ్రమల ఏర్పాటుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని గుడివాడ అమర్నాథ్ తేల్చిచెప్పారు.

English summary
On the second day of Andhra Pradesh Assembly, TDP leaders questioned about the Kadapa Steel Plant. Ministers Buggana Rajendranath Reddy and Gudivada Amarnath answered the questions of TDP and fires on the tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X