వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెసికి బాబు షాక్: అది పెద్ద సమస్యే కాదు, 2029వరకు టిడిపినే, సీమలో ఏకపక్షమే

2029వరకు ఏపీలో టిడిపిదే అధికారమన్నారు చంద్రబాబురాయలసీమలో కూడ టిడిపికే ఏకపక్షంగా ఫలితాలువస్తాయన్నారు.వైసీపీ చీఫ్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2014 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పునే 2019, 2024, 2029లో కూడ పునరావృతం అవుతాయని ఆ:ద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. రాయలసీమలో ఏకపక్ష ఫలితాలు వస్తాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీలో విపక్షనేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

టార్గెట్ జగన్: 2019 ఎన్నికలకు బాబు ప్లాన్, వైసీపీకి అగ్నిపరీక్షేటార్గెట్ జగన్: 2019 ఎన్నికలకు బాబు ప్లాన్, వైసీపీకి అగ్నిపరీక్షే

రాష్ట్రంలో ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో తమ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు కార్యక్రమాలను చేపడుతున్నట్టు బాబు చెప్పారు.

మంత్రి గంటాపై బాబు అసంతృప్తి, ఇదీ జరిగిందిమంత్రి గంటాపై బాబు అసంతృప్తి, ఇదీ జరిగింది

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన ఫలితాలను అందించేందుకు చర్యలను తీసుకొంటున్నట్టు చెప్పారు.

లగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు ప్లాన్ ఇదేలగడపాటి సర్వే: 2019లో టిడిపి గెలుపు ప్లాన్ ఇదే

 2029 వరకు.రాష్ట్రంలో టిడిపిదే అధికారం

2029 వరకు.రాష్ట్రంలో టిడిపిదే అధికారం


రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకుగాను 2014లో తనకు అధికారాన్ని అప్పగించారని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. 2019లో కూడ ప్రజలు మరోసారి టిడిపికే అధికారాన్ని కట్టబెట్టనున్నారని చెప్పారు. 2024, 2029 వరకూ కూడ రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు చెప్పారు. రాయలసీమలో కూడ టిడిపికి అనుకూల వాతావరణం నెలకొంటుందని బాబు చెప్పారు. అంతేకాదు ఏకపక్ష ఫలితాలు కూడ వచ్చే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు ధీమాను వ్యక్తం చేశారు.

జెసి దివాకర్ రెడ్డి వ్యవహరం పెద్ద సమస్యే కాదు

జెసి దివాకర్ రెడ్డి వ్యవహరం పెద్ద సమస్యే కాదు

అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి సమస్య పెద్ద సమస్యే కాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.జేసీ దివాకర్‌రెడ్డి వ్యవహారం పెద్ద సమస్యేమీ కాదని.. ఏ విషయంలోనైనా పద్ధతి ప్రకారం వెళ్లాలని సూచించారు. అందరికీ నీళ్లు కావాలి కాబట్టి ప్రాధాన్యతను వివరించి పనులు చేయించుకోవాలన్నారు. తాను అనంతపురం వెళ్లినప్పుడు జేపీ ప్రభాకర్‌రెడ్డి నీటి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని.. దాన్ని పరిష్కరించాలని అప్పుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని తెలిపారు.

పులివెందులకు నీళ్ళిస్తానంటే వద్దంటున్నారు

పులివెందులకు నీళ్ళిస్తానంటే వద్దంటున్నారు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై చంద్రబాబునాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. పులివెందులకు నీళ్లిస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సొంత ప్రాంతానికి నీరిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ నీటిని దొంగలిస్తున్నామని కొన్ని పత్రికలు రాస్తున్నాయని, ఆ రాతలు తనను ఎంతో బాధిస్తున్నాయని పేర్కొన్నారు

ఆ వార్తలు బాధించాయి.

ఆ వార్తలు బాధించాయి.

తెలంగాణ నీటిని దొంగలిస్తున్నామ‌ని కొన్ని ప‌త్రిక‌లు రాస్తున్నాయని, ఆ రాత‌లు త‌న‌ను ఎంతో బాధ క‌లిగిస్తున్నాయని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి జ‌రుగుతోంటే జ‌గ‌న్ ఓర్వ‌లేక‌పోతున్నార‌ని అన్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఆయ‌న ప‌త్రిక రాత‌లు రాస్తోంద‌ని మండిప‌డ్డారు.నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ రాష్ట్రానికి వ‌చ్చే నీళ్ల‌ను ఆ రాష్ట్ర వాడుకుంటుంద‌ని చంద్రబాబు వివ‌రించారు. ప్ర‌తిప‌క్ష నేత‌లు రాక్ష‌స‌త్వంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారని, వారు మ‌నుషులేనా అనిపిస్తోందని అన్నారు. వారు అన్ని ప్రాజెక్టుల‌కు అడ్డుత‌గిలారని, ఇలా తప్పుడు ప్ర‌చారాలు చేయ‌కూడ‌దని వ్యాఖ్యానించారు. క‌ఠిన నిర్ణ‌యాల‌తో తాము అవినీతిని కూడా అరిక‌డుతున్నామ‌ని చెప్పారు.

రాయలసీమ అభివృద్దికి చర్యలు

రాయలసీమ అభివృద్దికి చర్యలు

సాగునీటి ప్రాజెక్టులు పూర్త‌యితే రాయ‌ల‌సీమ మ‌రింత అభివృద్ధి చెందుతుంద‌ని చంద్రబాబు చెప్పారు. రాయ‌ల‌సీమ‌లోనూ ఏక‌ప‌క్ష ఫ‌లితాలు వ‌స్తున్నాయని చెప్పారు. తాను చేస్తోన్న మంచి ప‌నుల‌కు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు అడ్డుత‌గులుతున్నార‌ని అన్నారు. ప్రతిపక్ష నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ప్రజలు తమకే మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఎన్ని ఎన్నికలు జరిగినా తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

English summary
Ap chiefminister Chandrababunaidu said that Tdp will get power in Andhra pradesh state till 2029.Chandrababunaidu spoke to media on Friday evening at Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X