2019లో 175 సీట్లు గెలుస్తాం, హైద్రాబాద్‌లో పబ్‌లు, డ్రగ్సొచ్చాయి: బాబు
అమరావతి: ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తే 2019 ఎన్నికల్లో 175 సీట్లు టిడిపి కైవసం చేసుకొంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఒకవేళ 175 సీట్లు గెలుచుకోకపోతే లోపం మనదేనని బాబు అన్నారు. టిడిపిని ఓడించే శక్తి ఎవరికీ కూడ లేదన్నారు. హైద్రాబాద్‌లో పబ్‌లు, డ్రగ్స్ వచ్చాయని బాబు ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో టిడిపి ప్రజా ప్రతినిధులకు ఒక్క రోజు వర్క్‌షాప్‌ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌లో చంద్రబాబునాయుడు పలు అంశాలను ప్రస్తావించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చంద్రబాబునాయుడు వర్క్‌షాప్‌లో ప్రజా ప్రతినిధుల దృస్టికి తీసుకెళ్ళారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాక ముందే ఇతర ప్రాజెక్టుల ద్వారా నీరందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.

175 సీట్లు టిడిపికే, లేకపోతే లోపం మనలోనే
ప్రజల్లో నమ్మకం కల్గిస్తే 2019 ఎన్నికల్లో 175 సీట్లు టిడిపి విజయం సాధిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో నమ్మకాన్ని పొందేందుకు పార్టీ ప్రజాప్రతినిదులంతా ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉందని బాబు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు అందేలా చూడడంతో పాటు ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని బాబు సూచించారు.వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుచుకోకపోతే లోపం మనలోనే ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

1995 ముందు హైద్రాబాద్ ఎలా ఉంది
హైదరాబాదుకు మనం చేసిందేమీ లేదని కొందరు అంటున్నారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. 1995కు ముందు హైదరాబాద్.. ఆ తర్వాత ఎలా ఉందో ఆలోచిస్తే వాస్తవం అర్ధమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.హైద్రాబాద్‌లో డబ్బులు వచ్చాయి, ఆ తర్వాత పబ్‌లు వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత పబ్‌లో డ్రగ్స్ వచ్చాయని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు అడ్డంకులు తొలగిపోయాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. సాంకేతిక సమస్యలను అధిగమించినట్టు ఆయన చెప్పారు. అంతేకాదు నవయుగ సంస్థ పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిందని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని బాబు చెప్పారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టుపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

పట్టిసీమ, పురుషోత్తమ పట్నం , చింతలపూడి ద్వారా నీరిస్తాం
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి ద్వారా నీటిని అందించనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నీటి కోసం ఎదురు చూడకుండా ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించి రైతాంగం కష్టాలను దూరం చేయనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. మరో వైపు పోలవరం ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్ర ముఖచిత్రమే మారే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

మూడు, నాలుగు నెలల్లో రాజకీయ పునరేకీకరణ
రానున్న మూడు, నాలుగు నెలల్లో ఏపీ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ చోటు చేసుకొనే అవకాశం ఉందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు .గతానికి వినూత్నంగా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాయకులు ప్రణాళికలు రచించుకోవాలన్నారు. నేతల పనితీరు బాగుంటే ప్రజలు నిరంతరం ఆదరిస్తారని, ఎన్నికలంటే గతంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడి ఉండేవని, ఇప్పుడు పని తీరు మీద ఆధారపడి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
-
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications