తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ రికార్డును బద్దలుకొట్టిన సుగుణమ్మ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్నారు. టిడిపి అభ్యర్థి సుగుణ 1,16,524 ఓట్ల రికార్డుస్థాయి మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్‌, లోక్‌సత్తా సహా ప్రత్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి. మంగళవారం ఎన్నికల్లో విజయం సాధించిన సుగుణమ్మ టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. పార్టీ తరపున టికెట్ ఇచ్చి గెలిపించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుగుణమ్మను చంద్రబాబు అభినందించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధితులు కేటాయిస్తానని బాబు హామీ ఇచ్చారని సుగుణమ్మ తెలిపారు.

కాగా, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఫిబ్రవరి 13న తిరుపతికి ఉప ఎన్నిక జరిగింది. వెంకటరమణ భార్య సుగుణకు టిడిపి టికెట్‌ ఇవ్వడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది. కాంగ్రెస్‌, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థులతోపాటు మొత్తం 13 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏకగ్రీవం కావాల్సిన ఉప ఎన్నికకు పోలింగ్‌ అనివార్యం కావడంతో టిడిపి ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేసింది.

మొత్తం 1,47,216 ఓట్లు పోలవ్వగా, అందులో టిడిపి అభ్యర్థికి1,26,162 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 9628 ఓట్లు, లోక్‌సత్తా అభ్యర్థి కల్లూరి బాలసుబ్రమణ్యం 3819 ఓట్లు వచ్చాయి. తిరుపతి ప్రజలు, పార్టీ నాయకులు అందించిన ఈ విజయాన్ని తన భర్త దివంగత ఎమ్మెల్యే వెంకటరమణకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుగుణ ప్రకటించారు. కాగా, తిరుపతి అసెంబ్లీ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో అన్నింటికన్నా తక్కువగా 49.92 శాతం ఓట్లు పోల్‌ కావడం ఒక రికార్డు కాగా, టీడీపీ అభ్యర్థి 1,16,524 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం మరో రికార్డు. ఇప్పటి వరకు 1983లో ఎన్టీఆర్‌ మెజారిటీయే రికార్డుగా ఉంది. నాటి ఎన్నికలో పోలైన ఓట్లలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు 77 శాతం ఓట్లు రాగా, తాజా ఉప ఎన్నికలో మొత్తం ఓట్లలో 85.69 శాతం టిడిపి అభ్యర్థి సాధించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక రికార్డుగా నమోదుకానుంది.

సుగుణమ్మ గెలుపు

సుగుణమ్మ గెలుపు

తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో..

శ్రీవారి సన్నిధిలో..

టిడిపి అభ్యర్థి సుగుణ 1,16,524 ఓట్ల రికార్డుస్థాయి మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్‌, లోక్‌సత్తా సహా ప్రత్యర్థులందరి డిపాజిట్లు గల్లంతయ్యాయి.

విజయ సంకేతం

విజయ సంకేతం

తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంతో ఫిబ్రవరి 13న తిరుపతికి ఉప ఎన్నిక జరిగింది. వెంకటరమణ భార్య సుగుణకు టిడిపి టికెట్‌ ఇవ్వడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థి

కాంగ్రెస్ అభ్యర్థి

కాంగ్రెస్‌, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థులతోపాటు మొత్తం 13 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏకగ్రీవం కావాల్సిన ఉప ఎన్నికకు పోలింగ్‌ అనివార్యం కావడంతో టిడిపి ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేసింది.

టిడిపి సంబరాలు

టిడిపి సంబరాలు

మొత్తం 1,47,216 ఓట్లు పోలవ్వగా, అందులో టిడిపి అభ్యర్థికి 1,26,162 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 9628 ఓట్లు, లోక్‌సత్తా అభ్యర్థి కల్లూరి బాలసుబ్రమణ్యం 3819 ఓట్లు వచ్చాయి.

సుగుణమ్మ గెలుపు

సుగుణమ్మ గెలుపు

తిరుపతి ప్రజలు, పార్టీ నాయకులు అందించిన ఈ విజయాన్ని తన భర్త దివంగత ఎమ్మెల్యే వెంకటరమణకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుగుణ ప్రకటించారు. కాగా, తిరుపతి అసెంబ్లీ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులను ఈ ఉప ఎన్నికల నెలకొల్పింది.

సుగుణమ్మ గెలుపు

సుగుణమ్మ గెలుపు

ఇప్పటి వరకు జరిగిన 16 ఎన్నికల్లో అన్నింటికన్నా తక్కువగా 49.92 శాతం ఓట్లు పోల్‌ కావడం ఒక రికార్డు కాగా, టీడీపీ అభ్యర్థి 1,16,524 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం మరో రికార్డు.

సుగుణమ్మ గెలుపు

సుగుణమ్మ గెలుపు

ఇప్పటి వరకు 1983లో ఎన్టీఆర్‌ మెజారిటీయే రికార్డుగా ఉంది. నాటి ఎన్నికలో పోలైన ఓట్లలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు 77 శాతం ఓట్లు రాగా, తాజా ఉప ఎన్నికలో మొత్తం ఓట్లలో 85.69 శాతం టిడిపి అభ్యర్థి సాధించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇదొక రికార్డుగా నమోదుకానుంది.

సుగుణమ్మ గెలుపు

సుగుణమ్మ గెలుపు

తిరుపతి ప్రజలు, పార్టీ నాయకులు అందించిన ఈ విజయాన్ని తన భర్త దివంగత ఎమ్మెల్యే వెంకటరమణకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుగుణ ప్రకటించారు.

English summary
DP candidate M Sugunamma has won Tirupati Assembly seat. The party retains the seat in the by-election held due to the death of her husband M Venkataramana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X