అమ్మాయిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం నూతిరామన్నపాలెం గిరిజన సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని మాయమాటలు చెప్పి ఓ ఉపాధ్యాయుడు లోబరుచుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి.
నిందితుడికి అప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామంలోని పెద్దలు పంచాయతీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ సంఘటనకు సంబంధించి తమకు ఏ విధమైన ఫిర్యాదు కూడా అందలేదని పోలీసులు చెబుతున్నారు.
గ్రామ పెద్దలు పంచాయతీ చేసినట్లు తెలుస్తోంది. డబ్బులతో వివాదాన్ని పరిష్కరించినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ ఆ సంఘటనపై విచారణ చేపట్టింది. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి వ్యాయామ ఉపాధ్యాయుడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications