పదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన టీచర్

ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి(డిఈవో) సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థినికి తగిన న్యాయం చేయాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 4,500 డిటోనేటర్లు, 500 జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. 40 కిలోల అమ్మోనియం నైట్రేట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అగ్ని ప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లా వంగూరు సమీపంలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 లారీల పత్తి దగ్ధమైంది. రూ.80 లక్షల నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది.












Click it and Unblock the Notifications